Share News

భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్‌ ప్రశంసలు

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:09 AM

భారత ఎన్నికల ప్రక్రియపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పొగడ్తలు కురిపించారు. 64 కోట్ల మంది ఓట్లను ఒక్కరోజులో లెక్కించే వేగాన్ని ఆయన ప్రశంసించారు.

భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్‌ ప్రశంసలు

వాషింగ్టన్‌, నవంబరు 24: భారత ఎన్నికల ప్రక్రియపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పొగడ్తలు కురిపించారు. 64 కోట్ల మంది ఓట్లను ఒక్కరోజులో లెక్కించే వేగాన్ని ఆయన ప్రశంసించారు. అదే సమయంలో నవంబరు 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్‌ ద్వారా కూడా ఓటు వేసే అవకాశం ఉండటంతో ఒక్క కాలిఫోర్నియాలోనే లక్షల మంది ఈ విధానం ఎంచుకున్నారు. ఇంకా 3 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. భారత్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:09 AM