Iran vs Israel: అన్నంత పని చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌పై ఏకంగా..
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:14 AM
Iran vs Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరింత ముదిరింది. ఇరాన్(Iran) దాడి తరువాత సైలెంట్‌గా ఉన్న ఇజ్రాయెల్(Israel).. ఇప్పుడు వరుస క్షిపణుల(Missiles) దాడితో రెచ్చిపోయింది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్‌లో భారీ పెలుళ్లు ..
Iran vs Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరింత ముదిరింది. ఇరాన్(Iran) దాడి తరువాత సైలెంట్‌గా ఉన్న ఇజ్రాయెల్(Israel).. ఇప్పుడు వరుస క్షిపణుల(Missiles) దాడితో రెచ్చిపోయింది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్‌లో భారీ పెలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై క్షిపణి దాడుల చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా ఈ క్షిపణులను ప్రయోగించింది ఇజ్రాయెల్. వాస్తవానికి ఇస్ఫహాన్ ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.
ఇరాన్ అలర్ట్..
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా తమ ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్‌ను(గగనతల రక్షణ వ్యవస్థను) యాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది. అంతేకాదు.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చింది ఇరాన్. గుర్తు తెలియని డ్రోన్స్, మరేమైనా కనిపిస్తే ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..