Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 05 , 2024 | 08:36 AM
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఇజ్రాయెల్(israel), హమాస్(hamas) మధ్య గత ఐదు నెలలకు పైగా యుద్ధం(war) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నాయి. అయితే పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడలేదు. ఈ క్రమంలోనే భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి(india support) ఉందని ఐరాస(UNO)లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్(ruchira kamboj) పేర్కొన్నారు.
వీటో వినియోగంపై సోమవారం జరిగిన UN జనరల్ అసెంబ్లీ సమావేశంలో కాంబోజ్(ruchira kamboj) ఈ మేరకు వెల్లడించారు. ఈ వివాదంపై భారతదేశం వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష, అర్థవంతమైన చర్చల ద్వారా మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుందని ఆమె అన్నారు. ఇజ్రాయెల్(israel) భద్రతా అవసరాలను గౌరవిస్తూ సురక్షితమైన సరిహద్దులలో స్వతంత్ర దేశంలో పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛగా జీవించగలిగే రెండు రాష్ట్రాల పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం(Bharat) కట్టుబడి ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉద్రిక్తతలను తగ్గించాలని భారత శాశ్వత రాయబారి అభ్యర్థించారు. శాశ్వత పరిష్కారాన్ని చేసుకునేందుకు హింసను మానుకోవాలని, బందీలందరినీ విడుదల చేయాలని కోరారు. రెచ్చగొట్టే చర్యలను నివారించాలని, ప్రత్యక్ష శాంతి చర్చలను త్వరగా పునఃప్రారంభించేలా కృషి చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నామని రుచిరా కాంబోజ్(ruchira kamboj) అన్నారు.
అంతేకాదు ఈ ఘర్షణలో పౌరులు మరణించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. హింస, శత్రుత్వం మరింత పెరగకుండా నిరోధించడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఎలాంటి ఘర్షణ జరిగినా సామాన్యుల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని గుర్తు చేశారు. గాజా(gaza)లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత మొదలైన యుద్ధంలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rain Alert: ఈ ప్రాంతాల్లో మార్చి 7 వరకు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్