Share News

ఇజ్రాయెల్‌ డ్రోన్లలో పిల్లల ఏడుపు శబ్దాలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:05 AM

గాజాపై ఇజ్రాయెల్‌ సరికొత్త తరహా డ్రోన్లను ప్రయోగిస్తున్నదనీ, దానివల్ల జన నష్టం అపారంగా పెరిగిపోతోందనీ ‘అల్‌ జజీరా’ అనే చానల్‌ ఒక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఒక వీడియోను విడుదల

ఇజ్రాయెల్‌ డ్రోన్లలో పిల్లల ఏడుపు శబ్దాలు

విని బయటకువచ్చిన పాలస్తీనా ప్రజలపై ఆ దేశం దాడులు

సంచలన వీడియో విడుదల చేసిన ‘అల్‌ జజీరా’

గాజాస్ర్టిప్‌, డిసెంబరు 5: గాజాపై ఇజ్రాయెల్‌ సరికొత్త తరహా డ్రోన్లను ప్రయోగిస్తున్నదనీ, దానివల్ల జన నష్టం అపారంగా పెరిగిపోతోందనీ ‘అల్‌ జజీరా’ అనే చానల్‌ ఒక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఒక వీడియోను విడుదల చేసింది. పిల్లల ఏడుపులను, మహిళల అరుపులను పోలిన శబ్దాలను చేసేలా ఈ డ్రోన్లను (క్వాడ్‌కాప్టర్లు) తయారుచేశారని తెలిపింది. ఆ డ్రోన్లనుంచి వచ్చే కేకలు విని తమ ఇళ్లనుంచి, శరణార్థి శిబిరాలు, వైద్య క్యాంపుల నుంచి గుంపులుగా బయటకువచ్చే పౌరులపై అవి బాంబుల వర్షం కురిపిస్తున్నాయని ఈ చానల్‌ సంచలన ఆరోపణలు చేసింది. పాలస్తీనీయన్లను ఈ విధంగా ఏమార్చి పెద్దఎత్తున వారిని ఇజ్రాయెల్‌ హత్య చేస్తోందని హక్కుల పర్యవేక్షకురాలు మహా హుస్సేనీ.. అల్‌ జజీరా విడుదల చేసిన ఆ వీడియోలో మాట్లాడటం వినిపించింది. మరోవైపు.. గాజాలో సేఫ్‌జోన్‌లో ఉన్న ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 21 మంది పౌరులు మరణించారు. పరదాల కింద వీరికోసం క్యాంపును నిర్వహిస్తున్న దక్షిణ గాజాలోని ఆస్పత్రి యాజమాన్యం ఈ దాడిని ధ్రువీకరించింది. ఆకాశంనుంచి కురిసిన బాంబులవర్షానికి పరదాలకు మంటలు అంటుకుని.. అందులోని బాధితులు కాలిపోయారు.

Updated Date - Dec 06 , 2024 | 05:05 AM