Share News

Giorgia Meloni: G7 గ్లోబల్ గెస్టులకు నమస్తే అంటూ స్వాగతం..వీడియో వైరల్

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:37 PM

ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర(G7 Summit) సమావేశాలకు ఇటలీ(Italy) ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని(Giorgia Meloni) ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Giorgia Meloni: G7 గ్లోబల్ గెస్టులకు నమస్తే అంటూ స్వాగతం..వీడియో వైరల్
Italy PM Giorgia Meloni Namaste greetings

ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర(G7 Summit) సమావేశాలకు ఇటలీ(Italy) ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని(Giorgia Meloni) ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో మెలోని వచ్చిన ప్రపంచ నాయకులను భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే అంటూ అభివాదం చేయడం విశేషం. ఆ క్రమంలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లను భారతీయ పద్ధతిలో స్వాగతించారు. ఆ క్రమంలో ఇటలీ ప్రధాని నమస్తే చెప్పి చేతులు జోడించి స్వాగతం పలికారు.


వాస్తవానికి G7 ఏడు దేశాల(Group of Seven) సమూహం. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి. ఈ ఏడాది G7 50వ శిఖరాగ్ర సమావేశం ఇటలీలో నిర్వహిస్తున్నారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలోని రిసార్ట్‌లో జూన్ 13 నుంచి 15 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించగా, ఇప్పటికే ప్రధాని మోదీ నేడు ఇటలీ చేరుకున్నారు.


ఈ సమ్మిట్ ఎజెండాను సెట్ చేయడంలో కూడా మెలోని(Giorgia Meloni) స్వయంగా కీలక పాత్ర పోషించారు. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధంతో పాటు, ఆఫ్రికాలో వలసలను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించాలని ఇటలీ కోరుతోంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని కిషిడా సహా పలువురు కీలక నేతలు పాల్గొంటున్నారు.


ఇది కూడా చదవండి:

Saudi Arabia: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ల ఒప్పందం రద్దు

Gold and Silver Rate: గుడ్‌ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Read Latest International News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 01:40 PM