Share News

Mozambique: జైలు నుంచి 1500 మంది ఖైదీలు జంప్

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:08 PM

Mozambique: తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ దేశ రాజధాని మపుటోలోని జైలు నుంచి 1500 మంది ఖైదీలు పరారయ్యారు. అనంతరం జైల్లోని ఖైదీల మధ్య హింస చెలరేగింది. ఈ ఘటనలో 33 మంది మరణించారు. మరో 150 మంది గాయపడ్డారు.

Mozambique: జైలు నుంచి 1500 మంది ఖైదీలు జంప్

మపుటో, డిసెంబర్ 26: తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌ రాజధాని మపుటోలోని జైలు నుంచి 1500 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఆ క్రమంలో జైల్లో జరిగిన ఘర్షణల్లో 33 మంది ఖైదీలు మరణించారు. మరో 150 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అధికార ఫ్రెలిమోస్ పార్టీ గెలుపును నిర్ధారిస్తూ.. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో మొజాంబిక్ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆ క్రమంలో జైల్లోని ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటన జరిగింది. ఇక మపుటోని జైలు నుంచి పారిపోయిన వారిలో 150 మంది ఖైదీలును తిరిగి పట్టుకున్నామని పోలీస్ జనరల్ కమాండర్ బెర్నాడియో రఫెల్ వెల్లడించారు. అయితే మృతులతోపాటు గాయపడిన వారి వివరాలు తెలియదని స్పష్టం చేశారు. అదీకాక క్రిస్మస్ సెలవు దినం కావడంతో.. జైలు వద్ద భద్రత సిబ్బంది.. మిగిలిన రోజుల్లో కంటే తక్కువగా ఉన్నారన్నారు.


మొజాంబిక్‌లో గత అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దీంతో సుదీర్ఘ కాలంగా పాలన సాగిస్తున్న ప్రెలిమో పార్టీ అధికారాన్ని పొడిగిస్తూ.. ఆ దేశ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో అల్లర్లు ప్రారంభమైనాయి. ‌మరోవైపు జైలులోని చోటు చేసుకున్న ఘటనలకు, బయట జరిగిన నిరసనలు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ న్యాయ మంత్రి హెలెనా కిడ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Also Read: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు

Also Read: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం


తాజా పరిణామాల నేపథ్యంలో మొజాంబిక్‌లోని భద్రతతోపాటు న్యాయ వ్యవస్థపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని మొజాంబిక్‌లోని సెంటర్ ఫర్ డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ అడ్రియానో నువుంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. లో రాశారు. ఇది ఇలా ఉండగా.. సోమ, మంగళవారాల్లో ఎన్నికల ఫలితాలపై రెండు రోజుల హింసాకాండలో పెట్రోల్ బంకులు, పోలీస్ స్టేషన్లతోపాటు బంకులపై దాడుల జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా 21 మంది మరణించారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి దేశంలో మృతుల సంఖ్య 151కి చేరుకుంది.

For International News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 07:23 PM