Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం..
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:07 PM
జపాన్‌లో తాజాగా మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. జనవరి 1వ తేదీన సెంట్రల్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది.
టోక్యో, జనవరి 09: జపాన్‌లో తాజాగా మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. జనవరి 1వ తేదీన సెంట్రల్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది. సరిగ్గా వారం క్రితం సంభవించిన భూకంపంలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. న్యూఇయర్ తొలి రోజున సెంట్రల్ జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంసం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూప్రకంపనల ధాటికి సెంట్రల్ జపాన్ పరిధిలో చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. ఎంతో మంది శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరోసారి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.