Share News

Rocket Explodes: లాంచ్ చేసిన సెకన్లలోనే పేలిపోయిన రాకెట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:25 AM

జపాన్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ‘స్పేస్ వన్’ అనే ప్రైవేటు కంపెనీ ప్రయోగించిన రాకెట్ లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే గాల్లో పేలిపోయింది. ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా ఈ వైఫల్యం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్ ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే షేర్ చేసింది. టోక్యో కేంద్రంగా ఈ స్టార్టప్ కంపెనీ పనిచేస్తోందని, భూకక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి జపాన్ కంపెనీగా నిలవాలనే లక్ష్యంతో ‘స్పేస్ వన్’ కంపెనీ ప్రయోగాన్ని చేపట్టిందని వెల్లడించింది.

Rocket Explodes: లాంచ్ చేసిన సెకన్లలోనే పేలిపోయిన రాకెట్.. వీడియో వైరల్

పాన్‌లో (Japan) షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ‘స్పేస్ వన్’ (Space One) అనే ప్రైవేటు కంపెనీ ప్రయోగించిన రాకెట్ లాంచ్ (Rocket Launch) అయిన సెకన్ల వ్యవధిలోనే గాల్లో పేలిపోయింది. ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా ఈ వైఫల్యం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్ ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే షేర్ చేసింది. టోక్యో కేంద్రంగా ఈ స్టార్టప్ కంపెనీ పనిచేస్తోందని, భూకక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి జపాన్ కంపెనీగా నిలవాలనే లక్ష్యంతో ‘స్పేస్ వన్’ కంపెనీ ప్రయోగాన్ని చేపట్టిందని వెల్లడించింది.

వాకయామాలోని కంపెనీకి చెందిన సొంత లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని చేపట్టగా 18 మీటర్ల (60 అడుగులు) ఎత్తులో ఘన-ఇంధన రాకెట్ ‘కైరోస్ విస్ఫోటనం చెందిందని వివరించింది. తునాతునకలయ్యిందని పేర్కొంది. మండుతున్న రాకెట్ భాగాలు చుట్టుపక్కల పర్వత సానువులపై పడ్డాయని తెలిపింది.

రాకెట్ పేలిపోయిన ఘటనపై ‘స్పేస్ వన్’ కంపెనీ కూడా ప్రకటన చేసింది. ‘తొలి రాకెట్ ‘కైరోస్’ను ప్రయోగించాం. కానీ నిష్ఫలమయ్యింది. వివరాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని ప్రకటించింది. రాకెట్ ప్రయోగించిన 51 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదని వివిరంచింది. కాగా జులై నెలలో కూడా జపాన్‌లో ఉపగ్రహం పేలిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి జో బైడెన్ పేరు ఖరారు

Huge Explosion: రెస్టారెంట్‌లో భారీ పేలుడు..ఒకరు మృతి, 22 మందికి గాయాలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2024 | 10:30 AM