Israel Hamas War: యుద్ధం వేళ.. ఇజ్రాయెల్ ప్రధానిపై జో బైడెన్ బాంబ్
ABN , Publish Date - Mar 10 , 2024 | 09:56 PM
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్‌కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్‌కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కొన్నిసార్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి బైడెన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సహాయం చేయడం కన్నా.. ఇజ్రాయెల్‌ను నెతన్యాహూ మరింత బాధరపెడుతున్నాడంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.
గురువారం కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం అనంతరం.. సెనెటర్ మైకెల్ బెన్నెట్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో (Antony Blinken) జో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించేందుకు గాను నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని పేర్కొన్నారు. హమాస్ (Hamas) చేసిన ఉగ్రదాడి నుంచి తనని తాను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉందని.. కానీ తాను తీసుకుంటున్న చర్యల కారణంగా సామాన్య ప్రజలకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌కు సహాయం చేసే దాని కన్నా.. ఆ దేశ ప్రజలను బాధపెట్టేలా ఉందని వ్యాఖ్యానించారు. గాజాలో పెరుగుతున్న పౌర ప్రాణనష్టంపై.. ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.
ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. కాల్పుల విరమణకు చర్చలు కూడా సాగుతున్నాయి. కానీ.. రోజులు గడుస్తున్నా ఈ చర్చల ఫలితం తేలట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి