కెనడా పోలీసుల అదుపులో ఖలిస్థాన్ ఉగ్రవాది డల్లా
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:35 AM
ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్‌దీప్ డల్లాను కెనడాలోని హాల్టన్ రీజనల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ, నవంబరు 10: ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్‌దీప్ డల్లాను కెనడాలోని హాల్టన్ రీజనల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతడు హర్దీప్ సింగ్ నిజ్జర్ అనుచరుడిగా గుర్తింపు పొందాడు. డల్లాకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎ్‌సఐ, లష్కర్ ఏ తోయిబాతోను సంబంఽధాలు ఉన్నట్టు గతంలోనే ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు, డల్లాకు అనుచరులుగా వ్యవహరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఆదివారం పంజాబ్ పోలీసులు తెలిపారు. గత నెలలో ఫరీద్‌కోట్‌లో గురుప్రీత్ సింగ్ హరి నవ్‌ను, మధ్యప్రదేశ్‌లో మరో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆదిత్య కపూర్ అలియాస్ మఖాన్, రవీందర్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, కెనడాలో హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం వద్ద వందలాది మంది హిందువులు, సిక్కులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందూ-సిక్కు గ్లోబల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.