Israel: బీరట్‌లో మట్టుబెట్టిన ఇజ్రాయెల్ దళాలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 08:51 AM
హిజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫద్ షుక్రూను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. బీరట్‌లో ఉన్న ఫద్ షుక్రూను తమ వైమానిక దళ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వివరించాయి. హిజ్బుల్లాకు ఫద్ షుక్రూ సీనియర్ కమాండర్, వ్యూహాత్మక విభాగం అధిపతిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ వద్ద ఇటీవల రాకెట్ దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు.
జెరూసలేం: హిజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫద్ షుక్రూను (Hezbollah Commander Fuad Shukr) మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. బీరట్‌లో ఉన్న ఫద్ షుక్రూను తమ వైమానిక దళ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వివరించాయి. హిజ్బుల్లాకు ఫద్ షుక్రూ సీనియర్ కమాండర్, వ్యూహాత్మక విభాగం అధిపతిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ వద్ద ఇటీవల రాకెట్ దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు. ఆ దాడికి ఫద్ షుక్రూ కారణం అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి వివరించారు. గోలన్ హైట్స్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆ సమయంలోనే ప్రకటన చేశారు. షుక్రూ గురించి పక్కా సమాచారం తెలుసుకొని మరి ఇజ్రాయెల్ దళాలు దాడి చేశారు.
‘హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాకు ఫద్ షుక్రూ కుడి భుజం. ఆ సంస్థ కార్యకలాపాలు, దాడులకు సంబంధించి సలహాలు ఇచ్చేవాడు. ఇజ్రాయెల్‌లో పలు దాడుల్లో షుక్రూ పాత్ర ఉంది. విదేశాల్లో కూడా దాడులకు తెగబడ్డాడు. గాజా యుద్ధం మొదలైన తర్వాత.. ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని హసన్‌కు షుక్రూ సలహా ఇచ్చాడు. హిజ్బుల్లా ఆయుధ సంపత్తి బాధ్యతలను షుక్రూ నిర్వహించేవాడు. గైడెడ్ క్షిపణి, క్రూయిజ్ క్షిపణి, యాంటీ షిప్ క్షిపణి, రాకెట్లు, యూఏవీ లాంటి అధునాతన ఆయుధ సంపత్తిని హిజ్బుల్లాకు సమకూర్చాడు. షుక్రూ వల్లే 1990లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులపై దాడి జరిగింది. హర్ దోవ్ పక్కన పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సైనికులను కిడ్నాప్ చేసి, హతమార్చారు. తర్వాత పలు చోట్ల పౌరులపై దాడులకు తెగబడింది. వాస్తవానికి హిజ్బుల్లాతో గొడవ వద్దని ఇజ్రాయెల్ కోరుకుంది. కానీ హిజ్బుల్లా మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. హిజ్బుల్లా క్రూరంగా దాడులు చేస్తోంది. లెబనాన్, మధ్యప్రాచ్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించాలని మేం అనుకుంటున్నాం అని’ ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పష్టం చేశారు.
Read Latest International News and Telugu News