Kamala Harris: తాజా సర్వే వచ్చేసింది.. డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:59 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.
ఈ రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 44 శాతం ఓట్లు పడే అవకాశం ఉండగా.. ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌కు 47 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ సర్వే పేర్కొంది. మహిళలు, స్వతంత్రుల ఓట్లు ఎక్కువగా పడతాయని అంచనా వేసింది. అయితే ఈ పోల్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఇది నకిలీ సర్వే అని కొట్టిపారేశారు. ‘‘నా శత్రువుల్లో ఒకరు ఇప్పుడే పోల్ సర్వే విడుదల చేశారు. నాకు 3 శాతం ఓట్లు తగ్గాయట. జోనీ ఎర్నెస్ట్ (అయోవా సెనేటర్) నాకు ఫోన్ చేశారు. అందరూ నాకు కాల్ చేశారు. మీరు అయోవాలో ఓడిపోతున్నారని వారు చెప్పారు. కానీ నాకు రైతుల ప్రేమ ఉంది. వారు నన్ను అభిమానిస్తున్నారు. నేను వారిని ప్రేమిస్తు్న్నాను’’ ట్రంప వ్యాఖ్యానించారు. ఈ మేరకు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
కాగా అయోవా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమల హారిస్ కూడా ప్రచారం చేయలేదు. దీంతో ఈ రాష్ట్రంలో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది. గా రేపు (నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా ఎన్నికల్లో ఫలితాలను ఊహించలేని 7 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇరువురూ పలుమార్లు విస్తృతంగా ప్రచారం చేశారు.
కాగా ఆదివారం నాటికి అమెరికాలో ఇప్పటికే 75 మిలియన్ల మంది అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా ముందస్తు, ఈ-మెయిల్ ద్వారా ఓట్లు వేశారని ఎన్నికలను ట్రాక్ చేసే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యా్బ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా ఐయోవా రాష్ట్రంలో ఇప్పటికే ఓటు వేసినతో పాటు వేయాలని భావిస్తు్న్నవారి నుంచి అభిప్రాయాన్ని సేకరించామని మోస్ మోయిన్స్ సర్వే పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి 31 వరకు నిర్వహించారని తెలిపింది. మహిళలు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడివారు, స్వతంత్రులు ఉన్న ఓటర్లు కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సర్వే పేర్కొంది. కాగా ఐయోవా రాష్ట్రాన్ని గత రెండు ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ దాదాపు 10 పాయింట్ల తేడాతో గెలుచుకున్నారు. అయితే అంతకముందు 2008, 2012లలో బరాక్ ఒబామా ఇక్కడి నుంచి గెలవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..
ఇవాళ ఒక్క రోజే రూ.7.37 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే
For more Sports News And Telugu News