Share News

India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:16 PM

మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి.. ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం, టూరిజం వివాదం, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?

మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి.. ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం, టూరిజం వివాదం, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రోజులు గడిచేకొద్దీ వివాదం మరింత ముదురుతూ వస్తోందే తప్ప.. తాము చేసిన తప్పులకు మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది లేదు. అలాంటి మాల్దీవులు.. ఇప్పుడు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు కారణం..కొన్ని నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే!

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం

2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలతో పాటు పలు నిత్యావసర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజానికి.. ఈ వస్తువుల ఎగుమతులపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే.. మాల్దీవుల్లో ఆ నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిన తరుణంలో తమకు సహాయం చేయాలని ఆ దేశం భారత్‌ని విజ్ఞప్తి చేసింది. దీంతో.. దౌత్యపరమైన వివాదం ఉన్నప్పటికీ, ఆ వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధం నుంచి కేంద్ర మినహాయింపు ఇచ్చి, మాల్దీవులకు సహాయం అందించింది. ఈ నేపథ్యంలోనే.. మాల్దీవుల మంత్రి మూసా జమీర్ (Moosa Zameer) భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు..


‘‘2024, 2025 సంవత్సరాల్లో భారత్ నుంచి మాల్దీవులకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు వీలుగా కోటాను పునరుద్ధరించినందుకు గాను.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar), భారత ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం.. రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుంది. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన నిబద్ధతని తెలియజేస్తుంది’’ అని జమీర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇందుకు జైశంకర్ స్పందిస్తూ.. భారతదేశం తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ & SAGAR (సెక్యూరిటీ & గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్) విధానాలకు కట్టుబడి ఉందని అన్నారు.

Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు..

కాగా.. మాల్దీవుల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతి కోటాలను సవరించి.. 2024-25 ఆర్థిక్ సంవత్సరానికి గాను 1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,09,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు, 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతించింది. అలాగే.. మాల్దీవుల నిర్మాణ రంగానికి కీలకమైన నది ఇసుక, కంకర రాయి వంటి కీలకమైన వస్తువులను 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి చేయనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 04:17 PM