Namibia President: నమీబియా ప్రెసిడెంట్ హేజ్ గింగోబ్ మృతి..కారణమిదే
ABN , Publish Date - Feb 04 , 2024 | 09:44 AM
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున మృత్యువతా చెందారు.
నమీబియా అధ్యక్షుడు(namibia president) హేజ్ గింగోబ్(82)(hage geingob) ఆదివారం తెల్లవారుజామున మృత్యువతా చెందారు. ఆయన గత కొన్ని వారాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు ఆస్పత్రిలో మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అయితే గత నెల చివరిలో ఆయన సాధారణ వైద్య పరీక్షల తర్వాత చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళతానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గెంగోబ్ విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో హేజ్ గింగోబ్ మరణించారు.
2014లో ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో తాను ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డానని ప్రజలకు చెప్పారు. మరుసటి సంవత్సరం అధ్యక్షుడయ్యాడు. దక్షిణాఫ్రికా దేశంలో ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా జరిగింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు అనేక మంది ప్రముఖులు హేజ్ గింగోబ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Fire Accident: అడవిలో చెలరేగిన మంటలు.. 46 మంది మృతి