Share News

Moon Mission: మరో ‘చంద్రయాన్’ ప్రాజెక్ట్‌.. చంద్రునిపై ల్యాండ్ అయ్యేది ఆరోజే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:55 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలు సైతం ‘మూన్ మిషన్స్’ చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.

Moon Mission: మరో ‘చంద్రయాన్’ ప్రాజెక్ట్‌.. చంద్రునిపై ల్యాండ్ అయ్యేది ఆరోజే!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలు సైతం ‘మూన్ మిషన్స్’ చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే రష్యా ఒక ప్రయోగం చేసింది కానీ, అది విఫలమైంది. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మన ఇస్రో బాటలోనే చంద్రయాన్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. నిజానికి.. గత నెలలోనే నాసా చంద్రునిపై అడుగుపెట్టాల్సింది కానీ, అది సక్సెస్ కాలేదు. ల్యాండింగ్ విఫలమైంది. దీంతో.. NASA రెండో అంతరిక్ష నౌకని చంద్రునిపై పంపేందుకు సమాయత్తమవుతోంది.


ఈ మూన్ ల్యాండర్‌కి ‘ఒడిస్సియస్’ లేదా ‘ఆడి’ అని పేరు పెట్టారు. ఇది బుధవారం స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో బయలుదేరుతుంది. భూమి చుట్టూ 3,80,000 కి.మీ విస్తరించి ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఆ అంతరిక్ష నౌకను రాకెట్ తీసుకెళ్తుంది. ఇది అత్యంత వేగంగా చంద్రునిపైకి వెళ్తుందని ‘ఇంటూటివ్ మెషీన్స్’ సీఈవో స్టీఫెన్ ఆల్టెమస్ తెలిపారు. భూకక్ష్యలో రాకెట్ నుండి ల్యాండర్ విడిపోయాక.. అది ఆన్‌బోర్డ్ ఇంజిన్‌ని ఉపయోగించి ముందుకు సాగుతుందని చెప్పారు. ఇది కేవలం 10 రోజుల్లోనే.. అంటే ఫిబ్రవరి 22వ తేదీన చంద్రునికి చేరుకుంటుందని చెప్పారు. ఆ రోజు ఇది చంద్రునిపై ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ మిషన్ విజయవంతమైతే.. 1972లో అపోలో-17 మిషన్ తర్వాత చంద్రునిపైకి చేరుకున్న మొదటి అమెరికన్ అంతరిక్ష నౌకగా ఒడిస్సియస్ నిలుస్తుందని అన్నారు.

ఇదిలావుండగా.. నెల రోజుల క్రితమే ‘పెరెగ్రిన్’ అనే ల్యాండర్‌ను లాంచ్ చేయడం జరిగింది. నాసా అందించిన నిధులతో ఈ ప్రాజెక్ట్‌ని ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. అయితే.. అది తన లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయింది. దీనిని లాంచ్ చేసిన కొన్ని గంటలకే విఫలమైనట్లు ఆ కంపెనీ స్పష్టం చేసింది. 21వ శతాబ్దంలో ఇప్పటివరకూ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్, చైనా, జపాన్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఒడిస్సియస్ విజయవంతమైతే, అమెరికా ఆ జాబితాలోకి చేరిపోతుంది. మరి.. అది వీలవుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - Feb 13 , 2024 | 05:55 PM