Share News

North Korea: మాపై దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. కిమ్ హెచ్చరిక

ABN , Publish Date - Oct 04 , 2024 | 10:58 AM

ప్యోంగ్యాంగ్ భూభాగంపై అమెరికా సహా పలు దేశాలు దాడి జరిపడానికి సన్నద్ధమైతే నార్త్ కొరియా బలగాలు క్షణం ఆలోచించకుండా అణ్వాయుధాలను ప్రయోగిస్తాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హెచ్చరించారు.

North Korea: మాపై దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. కిమ్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ప్యోంగ్యాంగ్ భూభాగంపై అమెరికా సహా పలు దేశాలు దాడి జరిపడానికి సన్నద్ధమైతే నార్త్ కొరియా బలగాలు క్షణం ఆలోచించకుండా అణ్వాయుధాలను ప్రయోగిస్తాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హెచ్చరించారు. "ఒకవేళ శత్రువులు మా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే.. అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న అన్ని ప్రమాదకర ఆయుధాలను నిస్సంకోచంగా ప్రయోగిస్తాం" అని కిమ్ అన్నారు.

ప్యోంగ్యాంగ్‌కు పశ్చిమాన ప్రత్యేక దళాల సైనిక శిక్షణా స్థావరాన్ని తనిఖీ చేస్తున్న సందర్భంగా కిమ్ ఈ కామెంట్స్ చేసినట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్యోంగ్యాంగ్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే ఉత్తర కొరియా పాలన ముగిసిపోతుంది అని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికితోడు ఈ వారం ప్రారంభంలో దక్షిణ కొరియా సైనిక కవాతును కూడా నిర్వహించింది. "ఉత్తర కొరియా అణ్వాయుధాలను ప్రయోగిస్తే.. మా మిలిటరీ, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూటమి నుంచి ఆ దేశం సవాళ్లను ఎదుర్కోక తప్పదు" అని యున్ చెప్పారు. దీంతో సౌత్, నార్త్ కొరియాల మధ్య పరిస్థితులు యుద్ధ వాతావరణంలా మారాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వ్యాఖ్యలను కిమ్ జోంగ్ ఉన్ ఖండించారు.


తారాస్థాయికి..

ఇరు దేశాధినేతల పరస్పర ప్రకటనలతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మే చివరి వారం నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ వీడియోలు బయటకి వచ్చాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కిమ్‌ పిలుపునిచ్చినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్‌లను దక్షిణ సరిహద్దుల్లో మోహరించినట్లు ప్రకటించింది. మిత్రదేశాలైన రష్యా, చైనాల మద్దతుతో ఉత్తర కొరియా అనేకసార్లు యూఎన్‌ ఆంక్షలను ఉల్లంఘించింది.

For Latest news and National news click here

Updated Date - Oct 04 , 2024 | 10:58 AM