Share News

India-Pakistan: భారత్ చంద్రుడ్ని చేరితే.. పాక్ పిల్లలేమో మురుగు కాలువలో..

ABN , Publish Date - May 16 , 2024 | 04:27 PM

ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..

India-Pakistan: భారత్ చంద్రుడ్ని చేరితే.. పాక్ పిల్లలేమో మురుగు కాలువలో..
Pak Lawmaker Syed Mustafa Kamal Speech On INDIA

ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ (Pakistan) స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పటి నుంచి పాక్ నేతలు భారత్‌ని ఆకాశానికెత్తేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal).. పాక్ దుర్భర పరిస్థితిని వివరిస్తూ భారత్ సాధించిన పురోగతిని ప్రస్తావించారు. ఓవైపు భారత్ చంద్రుడ్ని చేరితే, పాక్‌లో మాత్రం పిల్లలు మురుగు కాలువలో పడి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు.

రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..

బుధవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో కమల్ మాట్లాడుతూ.. ‘‘కరాచీలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎంతలా అంటే.. ఓవైపు ప్రపంచ దేశాలు చంద్రునిపైకి వెళ్తుంటే, మరోవైపు ఇక్కడి పిల్లలు మురుగు కాలువలో పడి చనిపోతున్నారు. టీవీపై భారత్ చంద్రునిపై కాలుమోపిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే రెండు సెకన్లలో కరాచీలో ఓ మురుగు కాలువలో పడి ఓ పిల్లోడు చనిపోయాడనే వార్త వచ్చింది. ప్రతి మూడు రోజులకోసారి ఇలాంటి వార్తలే వస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మురుగు కాలువల్లో పిల్లలు చనిపోకుండా నివారించే చర్యలను సైతం చేపట్టలేని దారుణ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఆయన పేర్కొన్నారు.


విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

నిజానికి.. పాకిస్థాన్‌కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు అని, ఇక్కడ రెండు నౌకాశ్రయాలు ఉన్నాయని కమల్ చెప్పారు. ఈ నగరం పాకిస్తాన్‌, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్‌లకు ముఖద్వారం లాంటిదని అన్నారు. ఈ నగరం నుంచి 68 శాతం ఆదాయం సేకరించి, దేశానికి అందిజేస్తున్నామన్నారు. కానీ.. గత 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో నీరు అందడం లేదని మండిపడ్డారు. వచ్చే కొద్దిపాటి నీటిని కూడా మాఫియా దొంగలించి, ప్రజలకు అక్రమంగా అమ్ముతోందంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు.. పాక్‌లో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం లేదని, పిల్లలు చదువుకోకపోతే దేశ ఆర్థికాభివృద్ధి నాశనం అవుతుందని కమల్ హెచ్చరించారు.

చంద్రయాన్-3 ప్రాజెక్ట్

గతేడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అయిన విషయం తెలిసిందే. 2023 జూలై 14వ తేదీన దీనిని లాంచ్ చేయగా.. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6.04 గంటలకు ఇది చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రయాన్‌-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత రోవర్, ల్యాండర్ రెండు వారాల పాటు చంద్రునిపై ప్రయోగాలు జరిపి.. ఎంతో కీలక సమాచారాన్ని భారత్‌కి చేరవేశాయి.

Read Latest International News and Telugu News

Updated Date - May 16 , 2024 | 04:27 PM