Viral: విమానప్రయాణాలు చేయొద్దంటూ 4,300 మంది యాచకులపై పాక్ నిషేధం!
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:34 PM
యస్.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా 4,300 మంది యాచకులు విమానప్రయాణాలు చేయకుండా పాక్ ప్రభుత్వం వారిని తాజాగా నో ఫ్లై లిస్ట్‌లో చేరింది.
ఇంటర్నెట్ డెస్క్: యస్.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా 4,300 మంది యాచకులు విమానప్రయాణాలు చేయకుండా పాక్ ప్రభుత్వం వారిని తాజాగా నో ఫ్లై లిస్ట్‌లో చేరింది. పాకిస్థానీ యాచకులు సౌదీ అరేబియాలో భిక్షాటన చేస్తూ చికాకులు సృష్టిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం తీవ్ర అసంతృప్తి చేసింది. దీంతో, పాక్ హుటాహుటిన నో ఫ్లైలిస్టులో పలువురు యాచకులను చేర్చేసింది. వారు దేశం దాటకుండా అడ్డుకట్ట వేసింది (Pakistan).
Viral: లోదుస్తుల్లో బంగారం దాచి ఎయిర్ ఇండియా సిబ్బంది స్మగ్లింగ్!
పాకిస్థాన్ నుంచి వివిధ దేశాలకు ఉగ్రవాదం ఎగుమతి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, గాడిదలు, యాచకుల ఎగుమతులకూ దాయాది దేశం ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా అనేక మంది పాక్ యాచకులు హజ్, ఉమ్రా వంటి మతపరమైన యాత్రావీసాలను దుర్వినియోగ పరుస్తూ సౌదీ చేరుకుంటున్నారట. అక్కడ పవిత్ర నగరాలైన మెక్కా, మదీనాలో భిక్షాటన ప్రారంభిస్తూ స్థానికులతో పాటు ఇతర దేశాల యాత్రికులను తీవ్రంగా చికాకు పెడుతున్నారట. యాచకుల ఎగుమతుల వెనక ఏకంగా మాఫియా ఉందని సాక్షాత్తూ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ మాఫియాపై చర్యలకు ఉపక్రమించినట్టు సౌదీ మంత్రికి హామీ ఇచ్చారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, యాచకులు పాక్ నుంచి సౌదీకి వెళ్లడాన్ని అస్సలు సహించబోమని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసిందట.
పాక్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు అనేక మంది పాకిస్థానీలను పశ్చిమాసియా బాట పట్టేలా చేస్తున్నాయట. మతపరమైన యాత్రల పేరిట వీరిలో అనేక మంది సౌదీ చేరుకుని చివరకు భిక్షాటనకు దిగుతారట. దొంగతనాలకు కూడా దిగుతున్నారట. మెక్కాలో పట్టుబడ్డ దొంగల్లో 90 శాతం మంది పాకిస్థానీలేనని అధికారిక లేక్కలే స్పష్టం చేస్తున్నాయి.
సౌదీలో భిక్షాటనకు అనుమతి లేదు. యాచకులకు 6 నెలల కారాగార శిక్ష. యాచకులను ప్రోత్సహించిన వారికి, సాయపడ్డ వారికి 50 వేల రియాళ్ల జరిమానా విధిస్తారు. ఈ చట్టాల కారణంగా అనేక మంది పాకిస్థానీలో సౌదీలో జైలు పాలయ్యారు. దాదాపు 10 మిలియన్ల మంది పాక్ పౌరులు విదేశాల్లో ఉంటే వారిలో అనేక మంది భిక్షాటన చేస్తునట్టు గతేడాది విడుదలైన ఓ నివేదికలో తేలింది. సౌదీతో పాటు యూఏఈ, ఇరాక్‌లో కూడా పాక్ యాచకుల హడావుడి పెరిగిపోయింది. పాక్ యాచుకుల ప్రభావం ఇతర పాకిస్థానీలపైనా పడింది. సరైన కారణాలతో సౌదీ వెళదామనుకున్న అనేక మందికి వీసా దరఖాస్తులు తిరస్కరణకు గువడంతో ఏం చేయాలో తోచక లబోదిబోమంటున్నారట. యాచకుల సమస్యను పరిష్కరించని పక్షంలో సామాన్య పాక్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రభావం పడుతుందని కూడా సౌదీ హెచ్చరించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Latest and International News