Khyber Pakhtunkhwa: పాఠశాలలో అగ్నిప్రమాదం: తృటిలో తప్పించుకున్న విద్యార్థినులు
ABN , Publish Date - May 27 , 2024 | 06:02 PM
పాఠశాలలో 1400 మంది విద్యార్థినులు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుంచుకున్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో సోమవారం చోటు చేసుకుంది. హరిపూర్ జిల్లా సిరికోట్ గ్రామంలోని ప్రభుత్వ బాలికోన్నత ప్రాధమిక పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పాకిస్థాన్, మే 27: పాఠశాలలో 1400 మంది విద్యార్థినులు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుంచుకున్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో సోమవారం చోటు చేసుకుంది. హరిపూర్ జిల్లా సిరికోట్ గ్రామంలోని ప్రభుత్వ బాలికోన్నత ప్రాధమిక పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పాఠశాల అధికారులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు హుటాహుటిన పాఠశాల వద్ద చేరుకుని.. స్థానికుల సహయంతో మంటలను ఆర్పివేశారు. ఆ క్రమంలో పాఠశాలలోని 1400 మంది విద్యార్థులను వారు రక్షించారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో పాఠశాల పూర్తిగా దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.
MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు
ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని ఖైబర్ ఫక్తంక్వా చీఫ్ సెక్రటరీ నదీం అస్లాం చౌదరి స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ పాఠశాలను త్వరగా బాగు చేసి అందులోబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఖైబర్ పక్తుంక్వా సీఎం ఆలీ అమీన్ ఆరా తీశారు. ఈ ప్రమాద ఘటనలో వేగంగా స్పందించిన అధికారులపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు.
Read Latest National News and Telugu News