Share News

Indra Nooyi: అమెరికాలో అలాంటి తప్పులు చేయొద్దు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:37 PM

గత కొంతకాలం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో (America) భారతీయ, భారతీయ మూలాలున్న విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగుల చేతిలో దాడికి గురవ్వడం, అదృశ్యం కావడం, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. భారతీయ విద్యార్థులకు పెప్సీకో (PepsiCo) మాజీ సీఈవో ఇంద్రానూయి (Indra Nooyi) కొన్ని సూచనలు ఇచ్చారు.

Indra Nooyi: అమెరికాలో అలాంటి తప్పులు చేయొద్దు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు

గత కొంతకాలం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో (America) భారతీయ, భారతీయ మూలాలున్న విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగుల చేతిలో దాడికి గురవ్వడం, అదృశ్యం కావడం, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. భారతీయ విద్యార్థులకు పెప్సీకో (PepsiCo) మాజీ సీఈవో ఇంద్రానూయి (Indra Nooyi) కొన్ని సూచనలు ఇచ్చారు. అమెరికా చట్టాలను గౌరవిస్తూ.. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా.. డ్రగ్స్ & మద్యపానానికి దూరంగా ఉండాలని, కొత్త పరిచయాలపై ఆచితూచి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.


‘‘ఈమధ్య కాలంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో దురదృష్టకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని నేను విన్నాను. ఈ తరుణంలోనే.. ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అమెరికాలో చదువుకోవాలని ఇక్కడికి రావాలనుకుంటున్న విద్యార్థులతో ఈ వీడియో రూపంలో మాట్లాడేందుకు మీ ముందుకొచ్చాను. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం. చట్టానికి లోబడి ఉండండి. రాత్రిపూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు, అలాగే అతిగా మద్యం సేవించొద్దు. ఎందుకంటే.. ఇవన్నీ విపత్తుకు దారితీసే ప్రధాన అంశాలు. అమెరికాకు వచ్చే విద్యార్థులు మీ యూనివర్సిటీ, కోర్సులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. అమెరికాకు వచ్చిన మొదట్లో కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులు, కొత్త అలవాట్లు వంటి వాటిపై ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే.. అమెరికాకి వచ్చిన కొత్తలో లభించే స్వేచ్ఛ కారణంగా, వాటికి త్వరగా ఆకర్షితులవుతారు’’ అని ఇంద్రానూయి పేర్కొన్నారు.

కష్టపడి విజయం సాధించడంలో భారతీయ విద్యార్థులు చిరునామాలు అయినప్పటికీ.. కొందరు ఫెంటానెల్‌ వంటి డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఇంద్రానూయి తెలిపారు. ఇది ఎంతో ప్రాణాంతకమైనదని.. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు కెరీర్ అవకాశాల్ని సైతం దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకరమైన విషయాలతో ప్రయోగాలు చేయొద్దని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. స్థానిక చట్టాలను అర్థం చేసుకొని, వాటికి లోబడి ఉండాలని చెప్పారు. అలాగే.. వీసా స్టేటస్‌ గురించి తెలుసుకోవడంతో పాటు పార్ట్‌టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలని అన్నారు. అమెరికాలో ఒక విదేశీ విద్యార్థిగా మీకున్న హద్దులు తప్పకుండా తెలుసుకోవాలని నొక్కి చెప్పారు. రాత్రి సమయంలో చీకటి ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్లకుండా.. గుంపులుగా వెళ్లేందుకు ప్రయత్నించండని ఇంద్రానూయి ఉద్ఘాటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 03:37 PM