Share News

పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 147మంది సజీవ దహనం

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:43 AM

నైజీరియాలో బోల్తా పడిన పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి ఇంధనం తీస్తుండగా మంటలు చెలరేగి కనీసం 147 మంది సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన

పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 147మంది సజీవ దహనం

నైజీరియాలో ఘటన

అబుజా, అక్టోబరు 16: నైజీరియాలో బోల్తా పడిన పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి ఇంధనం తీస్తుండగా మంటలు చెలరేగి కనీసం 147 మంది సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కనో రాష్ట్రం నుంచి హైవేపై వెళ్తున్న ట్యాంకర్‌ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్క సారిగా పెట్రోల్‌ కోసం ఎగబడ్డారు. ప్రజలను ట్యాంకర్‌కు దూరంగా ఉండమని హెచ్చరించినప్పటికీ ఎవరూ వినలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పెట్రోల్‌ తీసుకుంటుండగా భారీ పేలుడు సంభవించి వంద మందికి పైగా మంటల్లో కాలి బూడిదయ్యారు. కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు.

Updated Date - Oct 17 , 2024 | 06:43 AM