Share News

PM Modi: బ్రూనైలో మోదీకి క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం.. రికార్డు సృష్టించిన ప్రధాని

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:21 PM

రెండు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్నేయాసియా దేశమైన బ్రూనై చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ఘనస్వాగతం పలికారు. బ్రూనే దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.

PM Modi: బ్రూనైలో మోదీకి క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం.. రికార్డు సృష్టించిన ప్రధాని

బందర్ సేరీ బేగవాన్: రెండు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆగ్నేయాసియా దేశమైన బ్రూనై (Brunei) చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ఘనస్వాగతం పలికారు. బ్రూనే దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. భారత్-బ్రూనే మధ్య దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రూనై సుల్తాన్ హాసనల్ బోల్కియా, రాజకుటుంబం సభ్యులను మోదీ కలుసుకుంటారు.

హమాస్‌ను అంతమొందించాల్సిందే: కమలాహ్యారిస్‌


కాగా, భారత్-బ్రూనై మధ్య దౌపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే దిశగా మోదీ పర్యటన సాగనుంది. వాణిజ్యం, ఇంధనం, అంతరిక్షం, సాంకేతికరంగం, ఆరోగ్యం, పెట్టుబడులు తదితర రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 3,4 తేదీల్లో బ్రూనైలో పర్యటన అనంతరం మోదీ సింగపూర్ చేరుకుంటారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు ఆరేళ్ల అనంతరం మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. సింగపూర్ దేశాక్షుడు టి.షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలు, వ్యాపారవేత్తలతో మోదీ భేటీ అవుతారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ విజన్‌‌లో భాగంగా ఈ రెండు దేశాల్లో మోదీ పర్యటనను భారత్ కీలకంగా భావిస్తోంది.

Updated Date - Sep 03 , 2024 | 06:16 PM