Share News

Bangladesh:రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 39 మంది మృతి..

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:18 PM

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 39 మంది మరణించగా, వందలమందికి గాయాలయ్యాయి.

Bangladesh:రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 39 మంది మృతి..
Students Protest

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 39 మంది మరణించగా, వందలమందికి గాయాలయ్యాయి. పోలీసులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరగడంతో బంగ్లాదేశ్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు. ఢాకాలోని రాంపుర ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ టెలివిజన్ భవనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి దాని ముందు భాగాన్ని ధ్వంసం చేశారు. అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మూడో వంతు 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులకు ఇచ్చేలా ఉన్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమ పట్ల ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్ధుల మధ్య సమాచార మార్పిడి జరగకుండా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది.

Earthquake: 7.3 తీవ్రతతో వణికించిన భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?


2500 మందికి గాయాలు..

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో దాదాపు 2,500 మందికి పైగా గాయపడ్డారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎక్కువుగా ఉన్న రాజధాని ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


మృతుల్లో ఎక్కువ మంది..

నిరసనల్లో మృతిచెందిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నారు. మరణించిన వారి వివరాలను అధికారులు విడుదల చేయలేదు. వారం రోజుల క్రితం నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 39 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయని అధికారులు తెలిపారు.


మెట్రో రైలు సేవలు..

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింస కారణంగా, అధికారులు రాజధానిలో మెట్రో రైల్‌తో పాటు ఢాకాకు బయలుదేరే రైల్వే సేవలను నిలిపివేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన సైనికులు రాజధాని ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా మోహరించారు.
Attack On Trump: దేవుడు నా వైపు ఉన్నాడు: హత్యాయత్నంపై తొలిసారి ట్రంప్ స్పందన


పారామిలటరీ బలగాల మోహరింపు

పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB), అల్లర్ల నిరోధక పోలీసులు, ఎలైట్ యాంటీ క్రైమ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) బలగాలు ఢాకాతో పాటు ప్రధాన నగరాల్లో మోహరించారు. దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తెరుచుకుని ఉన్నప్పటికీ జనం తాకిడి పెద్దగా కనిపించడంలేదు. రవాణా సేవల కొరతతో చాలా కంపెనీలకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి.


న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు

హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు ప్రధానమంత్రి షేక్ హసీనా గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఖోండ్కర్ దిలిరుజ్జామన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారని న్యాయశాఖ మంత్రి తెలిపారు. తమ శాంతియుత నిరసనలపై పోలీసుల మద్దతుతో అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ దాడి చేసిందని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రస్తుతానికి విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.


Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More International News and Latest telugu News

Updated Date - Jul 19 , 2024 | 12:18 PM