Share News

Golden Sneakers: ట్రంప్ ఆటోగ్రాఫ్డ్ గోల్డెన్ షూస్ దక్కించుకున్న వ్యాపారవేత్త.. వాటి విలువ ఏంతంటే

ABN , Publish Date - Feb 19 , 2024 | 07:36 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటివల రిలీజ్ చేసిన స్నీకర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కేవలం రెండు గంటల్లోనే వెయ్యి జతల షూస్ అమ్ముడయ్యాయి.

Golden Sneakers: ట్రంప్ ఆటోగ్రాఫ్డ్ గోల్డెన్ షూస్ దక్కించుకున్న వ్యాపారవేత్త.. వాటి విలువ ఏంతంటే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) ఇటివల రిలీజ్ చేసిన స్నీకర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కేవలం రెండు గంటల్లోనే వెయ్యి జతల షూస్ అమ్ముడయ్యాయి. అంతేకాదు ఈ స్నీకర్ల లాంచ్ సందర్భంగా బిడ్డింగ్‌లో పాల్గొనేవారి కోసం ట్రంప్ ఓ స్నీకర్ జతపై సంతకం చేశారు. ఆ క్రమంలో హాజరైన వారిలో ఒకరు ట్రంప్ మొట్టమొదటి ఆటోగ్రాఫ్ జత గోల్డెన్ నెవర్ సరెండర్ హై టాప్స్ షూస్ కోసం ఏకంగా 9,000 డాలర్లు(రూ.7,47,234) చెల్లించి దక్కించుకున్నారు. లగ్జరీ బజార్ వ్యవస్థాపకుడు, CEO, రోమన్ షర్ఫ్(Roman Sharf) ఈ బిడ్డింగ్ గెల్చుకున్నారు.


ఆ బిడ్డింగ్ గెల్చుకున్న సందర్భంగా సోషల్ మీడియా(Social media)లో రష్యన్ CEO ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో అతను ఇతర బిడ్డర్‌లను అధిగమించి గోల్డెన్ స్నీకర్లను దక్కించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తాను డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన స్నీకర్లలో ఒకటి ధరిస్తానని షార్ఫ్ గెలిచిన తర్వాత అన్నారు. ఆ తర్వాత తన పిల్లలకు స్నీకర్లను అందజేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

ఇక ఆ షూస్ వెనుక భాగంలో అమెరికన్ జెండాతోపాటు వివరాలను కలిగి ఉన్నాయి. ఈ స్నీకర్ ధర రూ.399 డాలర్లుగా ప్రకటించారు. శనివారం ఫిలడెల్ఫియాలో జరిగిన 'స్నీకర్ కాన్' ఈవెంట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు 'ట్రంప్ స్నీకర్స్' పేరుతో తన స్నీకర్ బ్రాండ్‌ను ప్రారంభించారు.

Updated Date - Feb 19 , 2024 | 07:37 PM