రష్యాకు చిక్కిన బ్రిటిష్ మాజీ సైనికుడు
ABN , Publish Date - Nov 26 , 2024 | 02:56 AM
ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పోరాడుతున్న ఓ బ్రిటిష్ మాజీ సైనికుడిని రష్యా సైన్యం పట్టుకుంది.
మాస్కో, నవంబరు 25: ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పోరాడుతున్న ఓ బ్రిటిష్ మాజీ సైనికుడిని రష్యా సైన్యం పట్టుకుంది. అతని పేరు జేమ్స్ స్కాట్ రైస్. వయసు 22 సంవత్సరాలు. బందీగా పట్టుబడిన అనంతరం అతను వివరాలు వెల్లడించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో... తాను 2019 నుంచి 2023 దాకా బ్రిటిష్ సైన్యంలో పనిచేసినట్లు జేమ్స్ వెల్లడించాడు. తన ఉద్యోగం పోవడంతో ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్లు చెప్పాడు. కాగా, దాదాపు 52 దేశాలకు చెందిన 20వేల మంది తమ సైన్యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు ఉక్రెయిన్ గతంలోనే ప్రకటించింది. ఓ పక్క రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో పలు ఇతర దేశాలు పాల్గొంటుండటంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాటో దేశాల సైనికులు రష్యాకు చిక్కడం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది.