New York : చేయని నేరానికి పదేళ్ల జైలు..
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:20 AM
చేయని నేరానికి పదేళ్ల శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికాలోని షికాగో కోర్టు.. ఏకంగా 50 మిలియన్ డాలర్ల (రూ.419.96 కోట్ల) పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్‌ను 2008లో
బాధితుడికి రూ.419 కోట్ల పరిహారం!
న్యూయార్క్, సెప్టెంబరు 11: చేయని నేరానికి పదేళ్ల శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికాలోని షికాగో కోర్టు.. ఏకంగా 50 మిలియన్ డాలర్ల (రూ.419.96 కోట్ల) పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్‌ను 2008లో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే బ్రౌన్‌తో పోలీసులు బలవంతంగా నేరం ఒప్పించారని.. అలాగే కల్పిత సాక్ష్యాలు సృష్టించారని 2018లో అతడి న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. దీంతో బ్రౌన్‌పై నమోదైన కేసును కొట్టేసిన కోర్టు.. అతడిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు జరిగిన అన్యాయంపై బ్రౌన్ షికాగో ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్ డాలర్లు.. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినందుకు 40 మిలియన్ డాలర్ల పరిహారం అతడికి చెల్లించాలి’ అని ఆదేశించింది.