Share News

Donald Trump: కమలా హారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్

ABN , Publish Date - Aug 01 , 2024 | 11:28 AM

అమెరిక అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారడం లేదు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. కమలా హారిస్ భారతీయురాలా..? లేదంటే నల్లజాతీయురాలా అని జాతి వివక్ష చూపుతూ మాట్లాడారు. షికాగోలో నేషనల్ అసోసియేన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. బ్లాక్ జర్నలిస్టుల సమక్షంలో నల్లజాతీయుల గురించి ప్రసంగించారు.

Donald Trump: కమలా హారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్
Donald Trump On Kamala Harris

వాషింగ్టన్: అమెరిక అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరు ఏ మాత్రం మారడం లేదు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై (Kamala Harris) మరోసారి నోరు పారేసుకున్నారు. కమలా హారిస్ భారతీయురాలా..? లేదంటే నల్లజాతీయురాలా అని జాతి వివక్ష చూపుతూ మాట్లాడారు. షికాగోలో నేషనల్ అసోసియేన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. బ్లాక్ జర్నలిస్టుల సమక్షంలో నల్లజాతీయుల గురించి ప్రసంగించారు.


భారతీయురాలే..!!

‘కమలా హారిస్ ఎప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. కానీ ఇన్నాళ్లూ ఆమె ఆ విధంగా ఉంటూ వచ్చారు. హారిస్ నల్లజాతీయురాలని కొన్నాళ్ల వరకు నాకు తెలియదు. భారతీయులు, నల్లజాతీయులు ఇద్దరిపై నాకు గౌరవం ఉంది. కమలా హారిస్ ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఆ విధమైన గుర్తింపును ఆమె కోరుకుంటున్నారా..? అని’ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.

trump--2.jpg


కమలా హారిస్ కౌంటర్

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమలా హారిస్ అదేస్థాయిలో స్పందించారు. ‘డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడుతున్నారు. విభజన సిద్ధాంతం, ఇతరులను అగౌరవపరిచే ధోరణిని ఏమాత్రం మానుకోవడం లేదు. అమెరికాకు ఇలాంటి వారు కాకుండా ఉత్తమ నాయకులు కావాలి. వైవిధ్యాలను విడదీయొద్దు. అందరినీ ఐకమత్యంగా ఉంచాలి. నిజనిజాలను నిర్భయంగా చెప్పాల్సి వచ్చిన సమయంలో శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మాత్రం మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి, ధైర్యంగా చెప్పే నాయకులు మనకు కావాలి అని’ కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌పై కౌంటర్ అటాక్ చేశారు.


Read Latest
International News and Telugu News

Updated Date - Aug 01 , 2024 | 11:28 AM