Japan: భూకంపం ధాటికి కకావికలమైన తీరం.. శాటిలైట్ ఫొటోలు చూడండి
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:37 PM
జపాన్ లో ఇటీవల వరుస భూకంపాలు(Japan Earthquake) సృష్టించిన వినాశనం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో ఒకే రోజు సుమారు 155 ప్రాంతాల్లో వరుస భూకంపాలు భయాందోళనలకు గురి చేశాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
టోక్యో: జపాన్‌లో ఇటీవల వరుస భూకంపాలు (Japan Earthquake) సృష్టించిన విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో ఒకే రోజు సుమారు 155 ప్రాంతాల్లో సంభవించిన వరుసగా భూకంపాలు భయాందోళనలకు గురి చేశాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే భూకంపం తీవ్రత ధాటికి జపాన్ సముద్ర తీర ప్రాంతం రూపురేఖలు మారిపోయినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. భూకంపం తరువాత కొత్త తీర ప్రాంతాలు ఏర్పడ్డాయి. తీరం వెంట భూమి ఎత్తు పెరిగిందని ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.
కొన్ని చోట్ల భూమి 250 మీటర్ల నుంచి 820 అడుగుల మేర విస్తరించినట్టు టోక్యో విశ్వవిద్యాలయం నిపుణులు అంచనా వేశారు. ఇది దాదాపు 2 అమెరికన్ ఫుట్ బాల్ మైదానాలతో సమానమని, తీరం వెంట భూమి పెరగడాన్ని ‘అప్ లిఫ్ట్’ అని పిలుస్తారని చెప్పారు.
దీంతో కొత్తగా బీచ్‌లు ఏర్పడ్డాయని యూనివర్సిటీ నిపుణులు పేర్కొన్నారు. తీర ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి. అక్కడ నిత్యం చేపలు పట్టే కొందరు స్థానికులు భూకంపం సమయంలో మొత్తం తీరం పైకి లేచిందని చెప్పారు. దీనిపై తమ పరిశోధన కొనసాగుతుందని టోక్యో యూనివర్సిటీ తెలిపింది