Share News

శ్రీలంక అధ్యక్ష ఎన్నిక ఫలితాలు నేడు!

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:45 AM

శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 13వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శ్రీలంక అధ్యక్ష  ఎన్నిక ఫలితాలు నేడు!

కొలంబో, సెప్టెంబరు 21: శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 13వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ 75 శాతం నమోదైందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే పోస్టల్‌ ఓట్లు, సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే, జనతా విముక్తి పెరమున(జేవీసీ)కి చెందిన అనూర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ(ఎ్‌సజేబీ) నాయకుడు సజిత్‌ ప్రేమదాస మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఫలితాలు ఆదివారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం జేవీసీ నాయకుడు అనూర కుమారకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నార

Updated Date - Sep 22 , 2024 | 03:45 AM