Home » Elections
లైసెన్స్డ్ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లలో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయప ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ తుపాకులు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పోటీ లేదని, అధికార డీఎంకే పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన పేర్కొనడం రాష్ర్ట వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ కూటమి, వైసీపీ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు.
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ హీరో విజయ్ ఒంటరిగానే మిగిలిపోనున్నారా.., వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే తలపడనున్నారా.. అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అలా అయితే.. అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పావంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
MLC Elections Results 2025: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. భారీ మొత్తంలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు.
1967, 1977సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Film actor Vijay) ధీమా వ్యక్తం చేశారు.
జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.