Sydney mall stabbing: షాపింగ్ మాల్‌లో కలకలం, దండగుడి దాడిలో ఐదుగురు దుర్మరణం
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:59 PM
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారంనాడు దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడంతో కనీసం ఐదుగురు మృతిచెందారు. ఒక చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.
సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney)లో శనివారంనాడు దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడంతో కనీసం ఐదుగురు మృతిచెందారు. ఒక చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.
అగంతకుడు అకస్మాత్తుగా మాల్‌లో కత్తితో జనంపై విరుచుకుపడ్డాడని, సుమారు తొమ్మిది మందిపై దాడి జరిపాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆంథోని కూకె తెలిపారు. నిందితుడిపై కాల్పులు జరపడంతో అతను హతమైనట్టు మీడియాకు ఆయన వెల్లడించారు. దుండగుడి దాడిలో ఐదుగురు మరణించినట్టు ధ్రువీకరించారు. మాల్‌లో ఉన్న సిబ్బందిని వెంటనే అక్కడ్నించి తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు ముందుగానే మాల్‌లోని జనాన్ని దూరంగా వెళ్లిపోమని హెచ్చరించి హంతకుడిని చుట్టుముట్టారని, కాల్పుల్లో అతను మరణించాడని వారు చెప్పారు. దుండగుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడనేది వెంటనే తెలియలేదు.
Hezbollah Attack: ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులతో లెబనాన్ దాడి..అక్కడి భారతీయులకు సూచనలు
ప్రధాని దిగ్భ్రాంతి..
సిడ్నీ షాపింగ్ మాల్‌లో విచక్షణారహితంగా దుండగులు జరిపిన దాడిలో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బెన్సే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, బాధిత కుటుంబాల బాధ తనను కలిచివేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం