Syrian Civil War: 13 ఏళ్లుగా తిరుగుబాటు
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:49 AM
సిరియాలో 2011 నుంచి తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. అంతర్యుద్ధం మొదలైంది. అసద్ కుటుంబం షియాలోని అల్లవీట్ వర్గానికి చెందినది. సిరియాలో ఈ వర్గం జనాభా 12% మాత్రమే.
సిరియాలో 2011 నుంచి తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. అంతర్యుద్ధం మొదలైంది. అసద్ కుటుంబం షియాలోని అల్లవీట్ వర్గానికి చెందినది. సిరియాలో ఈ వర్గం జనాభా 12% మాత్రమే. దేశంలోని టార్టస్, లకాటియా ప్రాంతాల్లో వీరు అత్యధికంగా ఉండగా.. మిగతా ప్రాంతాల్లో సున్నీలదే మెజారిటీ. అసద్ షియాకు చెందిన వ్యక్తి కావడంతో.. ఇరాన్ మద్దతిస్తూనే.. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాను రంగంలోకి దింపింది. రష్యా కూడా అసద్‌కు సహకరించింది. అసద్ తండ్రి హయాం నుంచి కూడా అధికారవర్గాల్లో షియాలనే నియమించడం, సున్నీలను అణగదొక్కడం రివాజుగా ఉండేది. అంతర్యుద్ధానికి ఈ అణచివేతే ప్రధాన కారణం. 2015లో తిరుగుబాటుదారుల ధాటికి అసద్ పతనం అంచులదాకా వెళ్లారు. అయితే.. ఇరాన్, హిజ్బుల్లా సహకారం.. రష్యా వాయుసేన రంగంలోకి దిగడంతో.. తిరుగుబాటు దారులు వెనక్కి తగ్గారు. అసద్ గట్టెక్కారు.