Poisonous Worms: ఇది అత్యంత విషపూరితమైన పురుగు.. సగానికి కట్ చేస్తే మళ్లీ రెండుగా..
ABN , Publish Date - Jul 24 , 2024 | 09:08 PM
ఒక్క వృక్షాలను మినహాయిస్తే.. జీవరాసులను సగానికి కట్ చేస్తే ఏమవుతుంది? ఆ వెంటనే చనిపోతాయి. అంతే తప్ప అవి మళ్లీ పునరుజ్జీవనం చెందవు. కానీ.. అలాంటి జీవి ఒకటి తాజాగా పుట్టుకొచ్చింది. అచ్చం సినిమాల్లో..
ఒక్క వృక్షాలను మినహాయిస్తే.. జీవరాసులను (Living Things) సగానికి కట్ చేస్తే ఏమవుతుంది? ఆ వెంటనే చనిపోతాయి. అంతే తప్ప అవి మళ్లీ పునరుజ్జీవనం చెందవు. కానీ.. అలాంటి జీవి ఒకటి తాజాగా పుట్టుకొచ్చింది. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగా.. ఆ పురుగుని సగానికి కట్ చేస్తే, అది చనిపోకుండా తిరిగి రీజనరేట్ అవుతుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అంతేకాదు.. అది ఎంతో విషపూరితమైంది కూడా! జంతువులతో పాటు మానవులకు ఇది ఎంతో ప్రమాదకరమైంది. టెక్సాస్‌లోని హ్యూస్టన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఈ పురుగులు బయటకు వచ్చాయి.
ఎంతో ప్రమాదకరం
ఆ పురుగు పేరు హామర్‌హెడ్ ఫ్లాట్‌వార్మ్ (Hammerhead Flatworm). ఇది ఒక అడుగు పొడవు ఉంటుంది. ఈ పురుగు స్రవించే విషం.. చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా.. దురద పుడుతుంది. పెంపుడు జంతువులు దాని విషం బారిన పడితే.. ఎంతో ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి తరచుగా పచ్చిక బయళ్లలో ఉంటాయి. వర్షం పడినప్పుడు మాత్రం రోడ్లపై కనిపిస్తాయి. ఇవి వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడతాయని నిపుణులు చెప్తున్నారు. హామర్‌హెడ్ షార్క్ మాదిరిగానే ఈ పురుగుల తల ఆకారం ఉంటుంది కాబట్టి.. దీనికి హామర్‌హెడ్ వార్మ్ అనే పేరు వచ్చింది. దీనిని షావెల్‌హెడ్ లేదా యారోహెడ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది 15 అంగుళాల పొడవ వరకు పెరుగుతుంది కాబట్టి.. చాలామంది వీటిని చూసి పాములుగా పొరబడుతుంటారు. ఈ పురుగు రీజనరేట్ అవుతుందని.. దీనిని సగానికి కట్ చేస్తే, రెండు పురుగులు పుట్టుకొస్తాయని ఆష్లే మోర్గాన్ అనే వాస్త్రవేత్త తెలిపారు.
వీటిని చంపడం ఎలా?
ఎవరికైనా ఈ పురుగులు కనిపించినప్పుడు.. నేరుగా కాకుండా చేతులకు గ్లౌవ్స్ ధరించి, ఒక ప్లాస్టిక్ బ్యాగుల్లో వాటిని వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అనంతరం ఆ బ్యాగులో ఉప్పు, వెనిగర్ లేదా సిట్రస్ నూనె వేసి.. రాత్రంతా ఫ్రీజ్ చేయాలి. అలా చేస్తేనే ఆ పురుగులు చనిపోతాయని అంటున్నారు. చనిపోయిన తర్వాత కూడా వాటిని చేతులతో నేరుగా ముట్టుకోకూడదు. తప్పకుండా గ్లౌవ్స్ ధరించాల్సిందే. ఒకవేళ ముట్టుకుంటే, వెంటనే హ్యాండ్ శానిటైజర్‌తో లేదా సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఈ పురుగులను తాకితే చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి.. చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. పరాన్నజీవులను సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఈ పురుగులు ఉంటాయి. దాంతో ఇవి మరింత ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు చెప్తున్నారు.
Read Latest International News and Telugu News