Share News

Viral News: అనారోగ్యం ఉన్నా డ్యూటీకి.. సెలవు ఇవ్వని కర్కశ మేనేజర్.. చివరికి..

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:04 PM

అనారోగ్యానికి గురైనా మేనేజర్ సెలవు ఇవ్వకపోవడంతో ఓ యువ ఉద్యోగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సుఖోథాయ్‌లో జరిగింది. డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో పని చేస్తున్న 30 ఏళ్ల మే(ఆమె పేరు) ఉద్యోగి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

Viral News: అనారోగ్యం ఉన్నా డ్యూటీకి.. సెలవు ఇవ్వని కర్కశ మేనేజర్.. చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: అనారోగ్యానికి గురైనా మేనేజర్ సెలవు ఇవ్వకపోవడంతో ఓ యువ ఉద్యోగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సుఖోథాయ్‌లో జరిగింది. డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో పని చేస్తున్న 30 ఏళ్ల మే(ఆమె పేరు) ఉద్యోగి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పెద్దపేగు సంబంధింత సమస్యలతో ఆమె ఈ నెలలోనే 5 నుంచి 9 వరకు అనారోగ్య సెలవులు తీసుకున్నారు. అనంతరం కంపెనీకి వచ్చినా.. పూర్తిగా కోలుకోకపోవడంతో మళ్లీ సెలవు పెట్టారు. తిరిగి సెప్టెంబర్ 12న ఆమె మళ్లీ విధుల్లో చేరారు. విధుల్లో చేరిన రోజే ఆరోగ్యం మరింతగా క్షీణించింది.


దీంతో సెలవు కోసం మేనేజర్ దగ్గరకు వెళ్లగా.. లీవ్ ఇవ్వడానికి అతను నిరాకరించాడు. సెలవు మంజూరు చేయాలంటే వైద్య ధ్రువీకరణ పత్రంతో రావాలని ఆమెకు సూచించాడు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆమె డ్యూటీ కొనసాగించారు. అయితే సెలవు నిరాకరించిన తరువాతి రోజే డ్యూటీలో చేరిన 20 నిమిషాలకే ఆమె కుప్పకూలింది. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మేను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. మే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో మరుసటి రోజు ప్రాణాలు విడిచింది. థాయ్‌లాండ్‌లో ఉద్యోగుల సంక్షేమంపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.


విచారం వ్యక్తం చేసిన కంపెనీ..

సంస్థ ఉద్యోగి మరణంపై డెల్టా ఎలక్ట్రానిక్స్ విచారం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో కంపెనీ ఓ పోస్ట్ చేసింది. “డెల్టా ఎలక్ట్రానిక్స్ తన సభ్యులలో ఒకరిని కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో కంపెనీ ఆమె కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు సంతాపాన్ని తెలియజేస్తుంది" అని పోస్ట్‌లో రాసింది. డెల్టా ఎలక్ట్రానిక్స్ CEO విక్టర్ చెంగ్ మాట్లాడుతూ.. “డెల్టా ఎలక్ట్రానిక్స్‌లో ఓ ఉద్యోగిని మేం కోల్పోయాం. ఇది అత్యంత బాధాకర విషయంరం. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. విచారణ తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. వారి కుటుంబానికి కంపెనీ అండగా నిలుస్తుంది. దర్యాప్తు జరుగుతున్నందున అన్ని వివరాలు అందించలేం" అని పేర్కొన్నారు. కాగా.. కేరళకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మృతితో దేశవ్యాప్తంగా కార్పొరేట్ ‘టాక్సిక్ వర్క్ కల్చర్’పై చర్చ మొదలైంది. పుణెలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (Ernst & Young-EY) కంపెనీలో నాలుగు నెలల కిందటే సెబాస్టియన్ ఉద్యోగంలో చేరారు. తమ కుమార్తె మృతికి పని ఒత్తిడే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలా పని ఒత్తిడి భరిచలేక సంభవిస్తున్న జబ్బులు, మరణాలు అనేకమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 03:06 PM