Share News

Haiti: హైతీలో తీవ్ర హింస.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన..

ABN , Publish Date - Mar 15 , 2024 | 10:17 PM

హైతీలో నెలకొన్న సంక్షోభం, హింస కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

Haiti: హైతీలో తీవ్ర హింస.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన..

హైతీలో నెలకొన్న సంక్షోభం, హింస కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయం చేసేందుకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేయడంతో హైతీ నుంచి తమ పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. "హైతీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు సైతం ఉన్నాయి." అని జైస్వాల్ వెల్లడించారు. శాంటో డొమింగోలోని తమ రాయబార కార్యాలయం అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం హైతీలో 50 నుంచి 80 మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఉన్నట్లు అంచనా. వారితో భారత రాయబార కార్యాలయం నిరంతరం సమచారం చేరవేస్తోంది. హైతీలో కొనసాగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం హైతీ రాజధానిలో 80 శాతం ప్రభుత్వ నియంత్రణలో ఉండగా.. మిగతా వాటి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 10:17 PM