అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్‌జెండర్ల తొలగింపు!
ABN , Publish Date - Nov 26 , 2024 | 02:59 AM
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్ జెండర్లను తొలగించేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
న్యూయార్క్, నవంబరు 25: ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్ జెండర్లను తొలగించేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంబంధిత ఉత్తర్వులను జనవరి 20న జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులను సాయుధ దళాల్లోకి తీసుకోవడం వల్ల భద్రత క్షీణిస్తోందని భావిస్తున్నందువల్లే ఆయన ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేత చెప్పారు. అమెరికా సైన్యంలో దాదాపు 15వేల మంది ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహిస్తున్నారు.