Share News

Donald Trump: అసద్‌ పనైపోయింది

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:53 AM

సిరియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: అసద్‌ పనైపోయింది

వాషింగ్టన్‌, డిసెంబరు 8: సిరియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పనైపోయినట్టేనని పేర్కొన్నారు. ఆయనను కాపాడడంలో పుతిన్‌కు ఇక ఏ మాత్రం ఆసక్తి లేదన్నారు. ఇన్నాళ్లూ అసద్‌కు పుతిన్‌ రక్షకుడిగా నిలిచారన్న ట్రంప్‌.. ఇక సిరియా యుద్ధానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.

సిరియా... ఊపిరి పీల్చుకో: జర్మనీ

అసద్‌ ప్రభుత్వ పతనంతో సిరియా ప్రజలకు ఉపశమనం లభించిందని జర్మనీ వ్యాఖ్యానించింది. అయితే సిరియా రాడికల్స్‌ చేతిలో పడకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బెర్బాక్‌ ఆకాంక్షించారు. దేవుడు తమకు ఊరటనిచ్చాడని లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని సిరియా శరణార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సిరియా శరణార్థులు రోడ్లపైకి వచ్చి సంబురాలు జరుపుకున్నారు.

Updated Date - Dec 09 , 2024 | 04:57 AM