Share News

Donald Trump: అలా అయితేనే నేను ఓటమిని ఒప్పుకుంటా: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:35 PM

ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరిగితే ఫలితమేదైనా తాను ఆమోదిస్తానని అన్నారు. ఓటమిని అంగీకరిస్తానని స్పష్టం చేశారు.

Donald Trump: అలా అయితేనే నేను ఓటమిని ఒప్పుకుంటా: డొనాల్డ్ ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఓటింగ్ హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఈసారి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే తన ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరుదైన సంఘటన


ఎన్నికల ఫలితాలపై కూడా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఫలితమేదైనా తాను ఆమోదిస్తానని అన్నారు. ఓటమిని అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ‘‘ఈ ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరిగితే నేను ఓటమి చెందితే ప్రజాతీర్పును అంగీకరిస్తా. అందరికంటే ముందు నేను నా ఓటమి గురించి చెబుతా’’ అని వ్యాఖ్యానించారు. మరో వైపు స్వింగ్ రాష్ట్రల ఫలితాలు అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్‌లు ఇద్దరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ట్రంప్, కమలా హ్యారిస్ గెలుపు అవకాశాల మధ్య తేడా స్వల్పంగా ఉండటం ఉత్కంఠకు రేపుతోంది.

For International News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 11:45 PM