Share News

America: 'రాసి పెట్టుకోండి బరాబర్ ట్రంపే అధ్యక్షుడు'.. చొక్కా చింపి సవాల్ చేసిన ప్రొఫెషనల్ రెజ్లర్

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:29 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి బరిలోకి దిగగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల కదనరంగంలోకి దూకారు.

America: 'రాసి పెట్టుకోండి బరాబర్ ట్రంపే అధ్యక్షుడు'.. చొక్కా చింపి సవాల్ చేసిన ప్రొఫెషనల్ రెజ్లర్

మిల్వాకీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి బరిలోకి దిగగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఇటీవలే నామినేషన్ సమర్పించిన ఇరువురు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో మిల్వాకీలో నిర్వహించిన స్టార్ స్టడెడ్ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ (RNC)లో ప్రొఫెషనల్ రెజ్లర్ హల్క్ హొగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే గెలుస్తారని చొక్కా చింపి మరీ సవాలు విసిరారు. ట్రంప్‌నకు బహిరంగ మద్దతు ప్రకటించారు.


అమెరికాను మళ్లీ పాలించాలని 'ట్రంప్-ఎ-మానియా'కు పిలుపునిచ్చారు. హల్క్ వయసు 70 ఏళ్లు కాగా ఆయన అసలు పేరు టెర్రీ జొ బోల్లియా. ఆయనకు ట్రంప్ అంటే చాలా అభిమానం. ట్రంప్‌ని హీరో, గ్లాడియేటర్ అంటూ తరచూ అభిమానంతో పిలుచుకునేవారు. ఇటీవలే ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఖండించారు. దాడి చేసిన నిందితుడు హతమైనప్పటికీ.. దాని వెనక ఉన్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని జో బైడెన్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.

"ప్రత్యర్థులు ట్రంప్‌ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. డొనాల్డ్ ట్రంప్ అందరికంటే కఠినమైన వ్యక్తి. ప్రత్యర్థులు ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు చేశారు. కోర్టులకు తిప్పారు. కానీ వాటన్నింటినీ ట్రంప్ తట్టుకున్నారు. గత వారం వాళ్లు నా హీరోపై కాల్పులు జరిపినప్పుడు ఏం జరిగింది. అమెరికా తదుపరి అధ్యక్షుడిని చంపడానికి ప్రయత్నించారు? ఇదంతా ట్రంప్ ఏ మానియాకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో మా అధినేత విజయం నల్లేరు నడకే" అని హల్క్ ఉద్ఘాటించారు.


ఎఫ్‌బీఐ చేతికి కీలక ఆధారం..

అయితే ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో ఎఫ్‌బీఐకి(FBI) కీలక ఆధారం లభించింది. నిందితుడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ ఈ ఘటన కంటే కొన్నాళ్ల ముందే ఏదో పెద్ద సంఘటన జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎఫ్‌బీఐ అధికారులు సెనెటర్లకు ఇచ్చిన వివరణలో ఈ విషయం వెల్లడైంది. నిందితుడు గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘స్టీమ్‌’లో ‘జులై 13న నా తొలి అడుగు.


అది ఆవిష్కృతమవుతున్నప్పుడు వీక్షించండి’ అని రాసుకొచ్చాడు. దర్యాప్తు బృందం క్రూక్స్‌ వినియోగించే ఫోన్లు, ఇతర సాంకేతిక పరికరాలు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా విశ్లేషిస్తోంది. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన 100 మందికిపైగా బంధువులు, సన్నిహితులు, స్నేహితులను విచారించారు. జులైలో అతడు బైడెన్‌, ట్రంప్‌నకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వెతికినట్లు ల్యాప్‌టాప్‌ తనిఖీలో బయటపడింది. డెమోక్రాట్ల నేషనల్‌ కన్వెన్షన్‌ సమాచారం జులై 13న ట్రంప్‌ ర్యాలీ వివరాలు వాటిల్లో ఉన్నట్లు తేలింది.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 11:37 AM