Share News

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:09 AM

యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్యసమితి.. సైనిక చర్య మొదలై ఏడాదికి పైగా దాటిన వేళ ఈ గడువును పెంచింది.

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!

  • ఐక్యరాజ్య సమితి నివేదిక

న్యూఢిల్లీ, అక్టోబరు 23: యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్యసమితి.. సైనిక చర్య మొదలై ఏడాదికి పైగా దాటిన వేళ ఈ గడువును పెంచింది. గాజా ఆర్థిక పునరుజ్జీవానికి శతాబ్దాలు పడుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయి, 2023 అక్టోబరు 7న హమాస్‌.. ఇజ్రాయెల్‌పై దాడి చేయకముందు నాటి ఆర్థిక పరిస్థితులు గాజాలో తిరిగి రావాలంటే 350 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. 2007-22 ఏడాదుల్లో ఉన్న సగటు వృద్ధి రేటు 0.4 శాతాన్ని చేరుకునేందుకు గాజాకు కనీసం 350 ఏళ్లు అవసరమని అభిప్రాయపడింది.


వృద్ధి రేటు సగటును సాధించినా జనాభా పెరుగుదల వల్ల స్థూలజాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం మాత్రం క్షీణిస్తూనే ఉంటాయని పేర్కొంది. యుద్ధం దెబ్బకు గాజాలోని నిర్మాణాలు, రహదారులు, కీలక మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమవ్వగా, ఎక్కడ చూసినా శిథిలాలు, కుళ్లిన శవాలు కనిపిస్తున్నాయి. పునర్నిర్మాణం కంటే ముందు వీటిని శుభ్రం చేయాల్సి ఉంది. 1670-1699 మధ్య యుద్ధాలు చేసిన ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌ దేశాలు ఆ పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతిని ఐరాస తన నివేదికలో ప్రస్తావించింది.

Updated Date - Oct 24 , 2024 | 05:09 AM