US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. గెలుపు ఎవరిది..?
ABN , Publish Date - Nov 04 , 2024 | 09:10 PM
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరిని దేశాద్యక్ష పదవి వరిస్తుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన అన్ని సర్వేలు ఇద్దరు పోటా పోటీగా ఉన్నారని స్పష్టమవుతుంది.
అమెరికా. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ దేశాధ్యక్ష ఎన్నికలు మంగళవారం అంటే.. నవంబర్ 5వ తేదీ జరగనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్‌లలో ఎవరికి అమెరికా ఓటరు పట్టం కడతాడనేది మరికొన్ని గంటల్లో తెలిపోనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ నిర్వహించిన జాతీయ సర్వేలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక విజయావకాశాలున్నాయో.. కమలా హారిస్‌కు సైతం అన్ని ఉన్నాయని ఇప్పటికే స్పష్టమైంది. దీంతో దేశాధ్యక్షుడి స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే ఓ చర్చ సైతం అగ్రరాజ్యంలో ఊపందుకుంది.
Also Read: MLC Elections: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా .. ఎన్నికల బరిలోకి..
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. ఆ దేశాధ్యక్ష ఎన్నికలు మంగళవారం అంటే.. నవంబర్ 5వ తేదీ జరగనుంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా, ఆదివారం వరకు 7.5 కోట్ల మందికిపైగా అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సారి ఆ దేశాధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్నాయి.
Also Read: Viral News: సోమశిల టు శ్రీశైలం బోటు ప్రయాణం..
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ ట్రంప్ ఇప్పటికే హష్ మనీ కేసులో దోషిగా తేలారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతుంది. అలాంటి వేళ.. కమలా హారిస్ బరిలోకి దిగారు. ఇప్పటికే దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది.
Also Read: TG Politics: అమరవీరుల స్తూపం వద్దకు వస్తారా? గంగాపురం, బండికి పొన్నం సవాల్
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికాకు తదుపరి అధ్యక్షుడు కానున్నారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రంతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా ఓటర్లు ఎలక్టోరల్ కాలేజీకి చెందిన ఎలక్టర్లను ఎన్నుకోనున్నారు. వారు తదుపరి నాలుగేళ్ల కాలానికి అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ఏడు స్వింగ్ రాష్ట్రాలు ప్రభావితం చేయనున్నాయి.
Also Read: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
అందులో పెన్సిల్వేనియా రాష్ట్రం అత్యంత కీలకంగా మారింది. అక్కడ అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లతో నార్త్‌కరోలినా, జార్జియా తర్వాత స్థానాల్లో నిలిచాయి. మిషిగన్‌లో 15, ఆరిజోనా 11, విస్కాన్సిన్ 10, నెవడాలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నుంచి దేశాధ్యక్ష అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై దృష్టి సారించారు.
Also Read: AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!
అయితే ఈ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. తన ప్రచారాన్ని ముందుకు సాగించారు. ఇక డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌తో జరిగిన తొలి బిగ్ డిబేట్‌లో సైతం ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో అప్పటి వరకు పడిపోయిన రిపబ్లికన్ల గ్రాఫ్ మళ్లీ లేచింది. తొలి డిబేట్‌లో వైఫల్యంతో పాటు ఇతరత్ర కారణాలతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కమలా హారిస్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి.
Also Read: కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?
ఎన్నికల రణరంగంలోకి దిగిన కమలాహారిస్ క్రమంగా పుంజుకొన్నారు. పలు సర్వేలు ఈ విషయాన్ని సైతం క్లియర్ కట్‌గా స్పష్టం చేశాయి. సెప్టెంబర్ 10న జరిగిన రెండో బిగ్ డిబేట్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు ప్రచారం జరగటం వల్ల కమల గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. ఈ దెబ్బతో మళ్లీ ఆమెతో ముఖాముఖి చర్చకు ట్రంప్ విముఖత ప్రదర్శించారు. డెమొక్రటిక్ పార్టీకి విరాళాలు సైతం భారీగా అందాయి.
బైడెన్ పోటీలో ఉన్నప్పుడు తన గెలుపు నల్లేరు మీద నడకగా ట్రంప్ భావించారు. కానీ కమల రాకతో ట్రంప్‌లో ఆందోళన సైతం మొదలైంది. రెండో డిబేట్‌లో కమల పైచేయి సాధించినట్లు ప్రచారం జరగటంతో ఆమెతో మరోసారి ముఖాముఖి చర్చకు ట్రంప్ నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక అయోవాలో షాకింగ్ టర్న్: హారిస్ లీడ్స్
డెస్‌మోయిన్స్ రిజిస్టర్/మీడియాకామ్ ఇటీవల సర్వే నిర్వహించింది. దీంతో అయోవాలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ట్రంప్‌పై 47% నుండి 44% మూడు పాయింట్ల తేడాతో హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. 2016, 2020 రెండింటిలోనూ ట్రంప్ అయోవాను గెలుపొందినందిన సంగతి తెలిసిందే. అసలు అయితే అయోవా సంప్రదాయవాదం వైపు మొగ్గు చూపుతుంది. అలాంటి ప్రాంతంలో మార్పు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతుంది.
అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన పోల్స్‌లో ట్రంప్, హారిస్ పోటా పోటీగా ఉన్నట్లు తేటతెల్లమైంది. ఈ ఇద్దరు అభ్యర్థులకు 49 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. రెండు శాతం మంది మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఎమర్సన్ కాలేజీ తాజాగా నిర్వహించిన జాతీయ పోల్స్‌లో ఇద్దరికి సమానంగా ఓట్లు అయితే వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖాయమని 50 శాతం మంది ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఇక 49 శాంత మంది హారిస్ గెలుస్తుందని అంటున్నారని యూఎస్ టూడే రిపోర్టు స్పష్టం చేసింది.
For International News And Telugu News