3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్
ABN , Publish Date - Sep 26 , 2024 | 09:55 AM
అమెరికాలోని టెక్సాస్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి త్రీడి ప్రింటింగ్ హోటల్ రూపుదిద్దుకోనుంది. టెక్సాస్ ఏడారి ప్రాంతంలోని మర్ఫా పట్టణం శివారు ప్రాంతంలో ఈ త్రీడి టింగ్ హోటళ్లు నిర్మిస్తున్నట్లు ఈఎల్ కాస్మికో సంస్థ అధినేత లిజ్ లాంబెర్ట్ వెల్లడించారు.
టెక్సాస్, సెప్టెంబర్ 26: అమెరికాలోని టెక్సాస్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి త్రీడి ప్రింటింగ్ హోటల్ రూపుదిద్దుకోనుంది. టెక్సాస్ ఏడారి ప్రాంతంలోని మర్ఫా పట్టణం శివారు ప్రాంతంలో ఈ త్రీడి టింగ్ హోటళ్లు నిర్మిస్తున్నట్లు ఈఎల్ కాస్మికో సంస్థ అధినేత లిజ్ లాంబెర్ట్ వెల్లడించారు. ఇది 16 హెక్టార్లో అంటే.. 40 ఎకరాల్లో 43 కొత్త హోటల్ యూనిట్లతోపాటు18 నివాస గృహాలను సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు.
వీటి నిర్మాణం కోసం అద్బుతమైన సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే సాధారణ హోటళ్ల నిర్మించినట్లు కాకుండా.. అంటే అన్ని హోటళ్లు నాలుగు గోడల మధ్య ఉంటాయన్నారు. కానీ అలా కాకుండా వంపులు, గోపురాలు, కిందకు వంపు తిరిగి ఉండే విధంగా వీటిని నిర్మిస్తున్నామన్నారు.
నిర్మాణంలో ఉన్న హోటళ్లతోపాటు నివాస గృహాలకు సంబంధించిన విశేషాలను ఈ సందర్బంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఇక ఈ నిర్మాణాల కోసం ప్రత్యేక సిమెంట్‌తో తయారు చేసిన లావాక్రీటిని వినియోగిస్తున్నట్లు ఐకాన్ సీఈవో జాసన్ బెల్లార్డ్ తెలిపారు. ఇది నాణ్యతతోపాటు మన్నిక సైతం ఇస్తుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఉండే విధంగా వీటిని నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఈ 3డీ ప్రింటింగ్ నిర్మాణానిదేనని ఆస్ట్రేలియాలోని చార్లెస్ డార్విన్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చరర్ మిలాద్ బజ్లీ పేర్కొన్నారు. అయితే 2026 నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని ఈఎల్ కాస్మికో సంస్థ స్పష్టం చేసింది. ఈ హోటళ్ల యూనిట్‌లో ఒక రాత్రికి బస చేయడానికి 200 నుంచి 450 యూఎస్ డాలర్లు వరకు వసూల్ చేయనున్నారని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో త్రీడి ప్రింటింగ్ కంపెనీ ఐకాన్, జార్కే ఇంగెల్స్ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.
చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికాలోని నాసా ప్రయత్నాలు చేపట్టింది. అందులోభాగంగా అక్కడ నివసించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ క్రమంలో మట్టితో ఇళ్లను నిర్మించే ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అందుకోసం త్రీడి ప్రింటింగ్‌తో అనుభవమున్న ఐకాన్ సంస్థతో నాసా ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందుగా భూమిపై త్రీడి ప్రింటింగ్‌తో భవనాలు, నివాసాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది. దాంతో టెక్సాస్‌లోని మర్ఫా పట్టణం శివారులో ఈ నిర్మాణాలను ఈ త్రీడి ప్రింటింగ్ చేపట్టింది.
For More International News And Telugu News...