Share News

Breaking News: గురువారం సుప్రీంలో కీలక కేసు విచారణ

ABN , First Publish Date - Dec 11 , 2024 | 11:14 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News: గురువారం సుప్రీంలో కీలక కేసు విచారణ
Breaking News

Live News & Update

  • 2024-12-11T21:53:23+05:30

    మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం

    • కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు రమణ (55) గుండెపోటుతో మృతి

    • రమణకు భార్య, ఇద్దరు పిల్లలు

    • సోదరుడి మరణ వార్త తెలుసుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచి వెళ్లిపోయిన కొల్లు రవీంద్ర

  • 2024-12-11T21:48:29+05:30

    గురువారం సుప్రీంలో కీలక కేసు విచారణ

    • గురువారం సుప్రీంకోర్టు లో రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ

    • అమరావతి ఏపీ ఏకైక రాజధాని అని గతంలో హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం తీర్పు

    • హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రింకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్

    • ఈ పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసిన కూటమి ప్రభుత్వం

    • గురువారం విచారణ సందర్భంగా ఈ అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

    • రాజధాని అమరావతి పై ఏపీ హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు నకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్న కూటమి సర్కార్

    • అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ అఫిడవిట్

    • రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్న ప్రభుత్వం

  • 2024-12-11T21:35:27+05:30

    ముగిసిన మంచు విష్ణు విచారణ

    • ముగిసిన మంచు విష్ణు విచారణ

    • మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని విష్ణుకి వార్నింగ్

    • మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సూచించిన పోలీస్ కమిషనర్

    • ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించిన సీపీ

    • శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న సీపీ

  • 2024-12-11T21:32:20+05:30

    పంచాయతీలకు జాతీయ అవార్డులు..

    • ఏపీలో 4 , తెలంగాణలో ఒక పంచాయతీకి జాతీయ పంచాయతీ అవార్డులు

    • జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • ఏపీలోని తగరంపూడి , న్యాయంపూడి , ముప్పాల , బొమ్మసముద్రం పంచాయతీలకు జాతీయ అవార్డులు

    • పెద్దపల్లి జిల్లాలోని చిల్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ అవార్డు

  • 2024-12-11T20:48:05+05:30

    తొలిరోజు ముగిసిన కలెక్టర్ల సదస్సు

    • ముగిసిన తొలిరోజు కలెక్టర్ల సదస్సు

    • శాంతి భద్రతల సమీక్ష గురువారానికి వాయిదా

    • గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న రెండో రోజు కలెక్టర్ల సమావేశం

  • 2024-12-11T20:14:47+05:30

    కొనసాగుతున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

    • కొనసాగుతున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం.. టిడీఆర్ పై రగడ

    • కూటమి కార్పొరేటర్ల కామెంట్స్

    • గత ప్రభుత్వ హయంలో భారీగా టీడీఆర్ కుంభకోణం జరిగింది

    • అప్పటి వైసీపీ పెద్దల డైరెక్షన్ లోనే ఈ స్కాం జరిగింది

    • జీరో డోర్ నంబర్స్ పెట్టి.. అర్హులు కాని వారికి టీడీఆర్ లు ఇచ్చారు

    • జారీ చేసిన టీడీఆర్ బాండ్లు, వాటి వివరాలు సభ్యులందరికీ ఇవ్వాలి

    • గతంలో జారీ చేసినటీడీఆర్‌ల పై శ్వేత పత్రం విడుదల చేయాలి

    • పూర్తి స్థాయిలో విచారణ జరిపి...తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • 2024-12-11T19:37:25+05:30

    ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

    • మార్చి 1 నుంచి 19వరకు ఇంటర్మడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు

    • మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు

  • 2024-12-11T19:29:46+05:30

    ఏపీలో క్రిస్మస్ కానుక

    • ఏపీలో క్రిస్మస్ కానుక ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

    • ఏపీలో ఆరునెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటన

    • గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వివిధమతాలకు అనుగుణంగా పండుగ కానుకలు

    • మరోసారి రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడంతో క్రిస్మస్ కానుక అందించనున్నట్లు ప్రకటించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

  • 2024-12-11T19:16:33+05:30

    హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్‌

    • హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్

    • సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్‌

    • పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట

    • తొక్కిసలాటలో మృతి చెందిన సరిత

    • కేసు నమోదు చేసిన చిక్కడ్‌పల్లి పోలీసులు

    • అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు

    • తనపై నమోదైన కేసుపు కొట్టేయాలని పిటిషన్‌లో కోరిన అల్లు అర్జున్

  • 2024-12-11T19:09:37+05:30

    ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    • ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్

    • ఎక్స్ వేదికగా పరీక్షల షెడ్యుల్ వివరాలు వెల్లడించిన మంత్రి

    • 2025 మార్చి 17 నుంచి 31 తేదీ వరకూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు

    • మార్చి 17 తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష

    • 19వ తేదీన రెండో లాంగ్వేజి పరీక్ష

    • 21వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష

    • 24వ తేదీన గణితం పరీక్ష

    • 26వ తేదీన భౌతిక శాస్త్రం పరీక్ష

    • 28వ తేదీన బయాలజీ పరీక్ష

    • 29 తేదీన ఓకేషనల్ పరీక్ష

    • 31 తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష

  • 2024-12-11T19:03:24+05:30

    పాఠశాలలో మత ప్రచారం.. ఏబీవీపీ ఆందోళన

    • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారంటూ ఏబీవీపీ నాయకుల ఆందోళన.

    • ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలలో క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణీ చేసిన ఓ సంస్థ

    • గిఫ్ట్ బాక్స్‌లలో బైబిల్ బుక్ ఉండడంతో విద్యాశాఖాధికారికి ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు

    • పాఠశాలకు చేరుకుని బాక్స్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • పాఠశాలలో మత ప్రచారం ఎలా చేయిస్తారంటూ ఓ ఉపాధ్యాయుడితో ఏబీవీపీ నాయకుల వాగ్వాదం

    • సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకుల డిమాండ్

  • 2024-12-11T18:55:12+05:30

    రాహుల్‌ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క

    • కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

    • రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుల గణన గురించి వివరించిన భట్టి విక్రమార్క

    • కేబినెట్ విస్తరణ గురించి చర్చ

  • 2024-12-11T18:53:43+05:30

    చెరువులో పడిని కారు..

    • వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు కట్ట పై ప్రమాదవశాత్తు చెరువులో పడిన కారు

    • కారులో ఇద్దరు ఉండగా తప్పించుకున్న ప్రేమ్ చంద్ అనే వ్యక్తి

    • కారులో ఇరుక్కపోయి మృతి చెందిన మరో వ్యక్తి విష్ణు

    • గజఈత గాళ్ళ తో గాలింపు చర్యలు చేపట్టి కారును బయటకు తీసిన పోలీసులు

    • మృతుడు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట వాసిగా గుర్తింపు

  • 2024-12-11T18:44:08+05:30

    రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

    • గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

    • నల్లపాడు సెంటర్‌లో వ్యాపారి ఇమడాబత్తిన నాగేశ్వరరావు కిడ్నాప్

    • కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళిన వైసీపీ నేత దుగ్గెం శివ నాగిరెడ్డి .

    • కైలాసగిరి కొండపైకి తీసుకెళ్ళి చంపుతానని బెదిరింపులు.

    • రూ.2 కోట్లు ఇవ్వాలని , లేకపోతే చంపుతానని వార్నింగ్

    • నాగేశ్వరరావు పై దాడికి పాల్పడిన వైసిపి నేత దుగ్గెం శివ నాగిరెడ్డి

    • తీవ్ర గాయాలతో జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు

  • 2024-12-11T18:32:57+05:30

    పోలీస్ కస్టడీకి విజయ్ పాల్

    • ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీస్ కస్టడీకి విజయ్‌పాల్

    • ఐదు రోజులు కస్టడీ కోరిన పోలీసులు

    • రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి,

    • 13 , 14 తేదీలలో విజయ్ పాల్‌ను విచారించనున్న పోలీసులు

  • 2024-12-11T13:27:48+05:30

    పులివెందులలో దారుణం..

    • కడప : పులివెందులలో నాటుతుపా కీతో హల్చల్.

    • పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్ ఘర్షణ.

    • తుమ్మలపల్లి కి చెందిన కోరా నాగిరెడ్డి పై బబ్లు అనే వ్యక్తి దాడి.

    • నాటుతుపాకి వెనుకభాగం వైపు మోది దాడి.

    • నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు.

  • 2024-12-11T12:23:28+05:30

    వైసీపీలో ముసలం.. ఆయన వొద్దంటున్న కేడర్..

    • గుంటూరు: వైసీపీలో ముసలం.. ఆయన వొద్దంటున్న కేడర్..

    • గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీలో ముసలం.

    • ఇన్‌చార్జ్‌ను మార్చాలంటూ కార్పోరేటర్‌లు పట్టు.

    • ఇప్పటికే జిల్లా, నగర అధ్యక్షులకు ఫిర్యాదులు.

    • నేడు వై.వి. సుబ్బారెడ్డి వద్దకు గుంటూరు తూర్పు వైసిపి పంచాయతీ.

    • ఇన్ చార్జ్ నూరీఫాతిమాను తప్పించాలని మెజారిటీ కార్పోరేటర్లు డిమాండ్.

  • 2024-12-11T12:18:41+05:30

    ఢిల్లీ: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏపీ జితేందర్ రెడ్డి గెలుపు.

    • తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గెలుపు.

    • తన ప్రత్యర్థి చాముండేశ్వరీనాథ్ పై విజయం సాధించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.

    • ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడిన ఏపీ జితేందర్ రెడ్డి.

    • తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది.

    • గత ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసింది.

    • హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తాం.

    • బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ పాలసీపై హడావుడి మాత్రమే చేసింది.

    • గతంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ హోదాలో కొందరు చీడపురుగులు ఉన్నారు.

    • యువత మత్తుకు బానిస కాకుండా క్రీడల వైపు వచ్చేలా చేస్తాం.

    • నూతన స్పోర్ట్స్ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ముందుకు తీసుకెళుతున్నాము.

  • 2024-12-11T12:06:20+05:30

    హైదరాబాద్‌: మోహన్‌బాబు హెల్త్ బులిటెన్ విడుదల

    • మోహన్ బాబు ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేసిన కాంటినెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్.

    • హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి.

    • బీపీ పెరిగింది.

    • అతనికి ప్రస్తుతం మెడలో నొప్పి విపరీతంగా ఉంది.

    • మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు.

    • ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారు.

    • ఫేస్ మీద కొన్ని గాయాలు ఉన్నాయి.

    • బీపీ 200 పైన ఉంది.. ఇవ్వాళ కూడా ఇంకా బీపీ ఉంది.

    • హార్ట్ సైడ్ అంతా బాగానే ఉన్నారు.

    • రాత్రంతా బాధ వల్ల నిద్ర లేదు.

    • గతంలో జరిగిన కొన్ని సర్జరీలతో ఆయన వేరే మెడిసిన్ వాడుతున్నారు.

    • కాంటెనెంటల్ వైద్యులు.

    • ప్రస్తుతం ఇంకా అన్ స్టెబుల్‌గానే ఉంది.

    • ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి.

    • సీటీ స్కాన్ తీసాము.

    • డిశ్చార్జ్ కి ఇంకా రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది.

    • ఆయన మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుంది.

  • 2024-12-11T11:46:54+05:30

    హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు..

    • హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్.

    • తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేసిన మోహన్ బాబు.

    • తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు.

    • తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్.

    • మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్.

  • 2024-12-11T11:44:40+05:30

    అమరావతి: నేడు, రేపు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

    • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌-2047..

    • నూతన పాలసీలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు

    • ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం

    • భవిష్యత్‌ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు

    • 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై రివ్యూ

    • నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చ

    • శాంతిభద్రతల పైనా డీజీపీ, ఎస్పీలతో సమీక్షించనున్న చంద్రబాబు

  • 2024-12-11T11:40:39+05:30

    బాబోయ్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

    • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

    • శ్రీలంక, తమిళనాడు వైపు పయనం

    • నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు

    • చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు

  • 2024-12-11T11:14:35+05:30

    నేను ఇంట్లో డబ్బు, ఆస్తి అడగలేదు: మంచు మనోజ్‌

    • అనవసరంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు: మంచు మనోజ్‌

    • నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించింది.

    • మా నాన్న స్నేహితులు చెప్పడంవల్లే నేను ఇంటికి తిరిగొచ్చా.

    • ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు: మంచు మనోజ్‌

    • నాన్న తరఫున క్షమాపణ కోరుతున్నా: మంచు మనోజ్‌

    • కన్నీటిపర్యంతమైన మంచు మనోజ్‌.