UttarPradesh: 17 మంది వైద్యులపై వేటు వేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Jul 11 , 2024 | 07:51 PM
కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దీర్ఘ కాలంగా సెలవు పెట్టిన 17 మంది వైద్యులపై చర్యల తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉప క్రమించింది. ఆ క్రమంలో వారిని డిస్మిస్ చేయాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గురువారం నిర్ణయించారు.
లఖనవూ, జులై 11: కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దీర్ఘ కాలంగా సెలవు పెట్టిన 17 మంది వైద్యులపై చర్యల తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉప క్రమించింది. ఆ క్రమంలో వారిని డిస్మిస్ చేయాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గురువారం నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించినట్లు ఆయన తెలిపారు. అయితే రోగులకు సేవ చేయడమంటే.. భగవంతుడికి సేవ చేయడంతో సమానమని ఆయన పేర్కొన్నారు. అయితే ఆరోగ్య మంత్రిగా ఇలా ప్రజలకు బాధ్యతతో సేవ చేయడం తనకు వచ్చి గొప్ప అవకాశంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.
Also Read: Shiv Sena: పూజా కేడ్కర్ ‘వ్యవహారం’పై స్పందించిన ఎంపీ
Also Read: Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Also Read: Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ
విధుల్లో ఎటువంటి ఆలసత్వాన్ని, క్రమశిక్షణరాహిత్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖను సైతం డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ పర్యవేక్షిస్తున్నారు. ఇక డిస్మిస్ అయిన ఈ వైద్యులంతా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు బ్రజేష్ పాఠక్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. అదీకాక.. 17 మంది వైద్యుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. డిప్యూటీ సీఎం జారీ చేసిన అందాయని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్ చాట్ వైరల్
Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం..
Also Read: Rajendra Nagar MLA: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..
ead Latest AP News And Telugu News