Viral News: నాలుగు నెలలకే పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు..
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:29 AM
జోధ్‌పూర్‌కు చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహాం చేశారు. దీంతో యువతికి 15 ఏళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని ఆమె అత్తమామలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. భర్తతో ఉండటానికి ఇష్టపడని అనిత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ..
చిన్న వయసులోనే పెళ్లి చేసి వయసు వచ్చాక కాపురానికి పంపించే ఘటనలు గతంలో ఎన్నో చూశాం. బాల్య వివాహాలను న్యాయస్థానాలు రద్దు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో చైతన్యం తీసుకువస్తున్నా.. బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్ జోధ్‌పూర్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. చివరికి యువతి పోరాటంతో న్యాయస్థానం బాల్య వివాహాన్ని రద్దు చేసింది. అంతేకాదు యువతి కోర్టు ఖర్చులను భరించాలని అత్తింతివారిని ఆదేవించింది. జోధ్‌పూర్‌కు చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహాం చేశారు. దీంతో యువతికి 15 ఏళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని ఆమె అత్తమామలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. భర్తతో ఉండటానికి ఇష్టపడని అనిత బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగింది. తన సోదరి, సోదరుడి సహాకారంతో బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడింది. చివరకు సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి సహకారంతో బాల్య వివాహాంపై పోరాడి గెలిచింది. జోధ్‌పూర్‌లోని కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి అనిత బాల్య వివాహన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కోర్టు వ్యాజ్యం ఖర్చులను బాధిత యువతికి చెల్లించాలని అత్త,మామలను న్యాయస్థానం ఆదేశించింది.
Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..
20 ఏళ్ల వయసులో రద్దు..
అనితకు నాలుగు నెలల వయసులోనే బాల్య వివాహం చేశారు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి భర్త ఇంటికి పంపించాలని ఒత్తడి చేశారు. దీంతో ఐదేళ్లుగా అనిత న్యాయ పోరాటం చేసింది. చివరకు ఆమెకు 20 ఏళ్ల వయసులో విజయం సాధించింది. కోర్టు అనితకు సానుకూలంగా తీర్పునిచ్చింది. ఓవైపు బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో బాల్యవివాహాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చులు అధికం
కోర్టు కీలక వ్యాఖ్యలు..
అనిత బాల్య వివాహం రద్దు సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాల్య వివాహాలు దుర్మార్గం మాత్రమే కాదు.. నేరమని కోర్టు పేర్కొంది. చిన్న వయసులో వివాహాలు పిల్లల భవిష్యత్తును పాడుచేస్తాయని తెలిపింది. అమ్మాయి లేదా అబ్బాయి బాల్య వివాహాలను కొనసాగించకూడదనుకుంటే, బాల్య వివాహాలను రద్దు చేసే హక్కు వారికి ఉందని తెలిపింది. బాల్య వివాహాల రద్దు కోసం మరింత కృషి అవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అనిత నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించారు. కాని కృతి భారతి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అనిత తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో అత్తవారింటికి వెళ్లకూడదనే అనిత నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు.
Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..
Chanakya Niti: మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఈ 3 టిప్స్ పాటించాల్సిందే
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here