Share News

IMD: దేశంలో గతేడాది కంటే ఎక్కువ వేడితో.. ‘అత్యంత వేడి సంవత్సరం’గా 2024..

ABN , Publish Date - Apr 02 , 2024 | 12:32 PM

ఈ ఏడాది ఎండలు మండుతాయని.. అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ తెలిపింది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం సాధారణం కంటే అధిక వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

IMD: దేశంలో గతేడాది కంటే ఎక్కువ వేడితో.. ‘అత్యంత వేడి సంవత్సరం’గా 2024..

ఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండుతాయని.. అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ (IMD) తెలిపింది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం (Summer) సాధారణం కంటే అధిక వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. 2023 కంటే 2024 అధ్వాన్నమైన వేడి తరంగాలను చూసే అవకాశం ఉందని అంతర్జాతీయంగా అనేక నివేదికలు వెల్లడించడంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి.

YS Sunitha.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి: వైఎస్‌ సునీత

ఏప్రిల్ నుంచి జూన్ వరకూ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల హెచ్చరించినట్లు ఐఎండీ తెలిపింది. ఆసియా, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్ హీట్’ రికార్డుల తర్వాత ఈ ఏడాది అత్యధిక వేడిని నమోదు చేయవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఎక్కువ వేడితో... రికార్డుల్లో ‘అత్యంత వేడి సంవత్సరం’గా నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సీజన్‌లో ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Siddaramaiah: నేను సీఎంగా ఉండాలంటే.. వరుణలో 60వేల మెజారిటీ రావాలి

ఈ ఏప్రిల్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, ఈశాన్య భారతంలో ఒకటి, రెండు చోట్ల మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ నెలవారీ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దక్షిణ ద్వీపకల్పం, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు సంభవించే అవకాశం ఉంది. ఈ నెలలో దేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. తూర్పు, పశ్చిమ తీరాలు, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Lok Sabha Elections: పారాచూట్‌ నాయకులకు బీజేపీ టికెట్లు.. బలం పెరుగుతుందా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 12:48 PM