Share News

Delhi: 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు.. ఆసుపత్రి అరుదైన రికార్డ్

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:41 AM

ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(RML) ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం(World Plastic Surgery Day) సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది.

Delhi: 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు.. ఆసుపత్రి అరుదైన రికార్డ్

ఢిల్లీ: ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(RML) ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం(World Plastic Surgery Day) సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది.

గాయాలు, కాలిన గాయాలు, వైకల్యాలు, పుండ్లు తదితర చర్మ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేసి అరుదైన రికార్డ్ సృష్టించింది. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ సర్జరీలు ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు.


అత్యవసర కేసులను ప్రభావితం చేయకుండా, ప్రత్యేక వైద్యుల బృందం ఏకకాలంలో పని చేసింది. డాక్టర్ భట్టాచార్య మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సర్జరీ ఓటీ మారథాన్ కూడా ఒక శిక్షణలాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చే బాధితుల ప్రాణాలు పోకుండా ఉపయోగపడుతుందని తెలిపారు.

తమ ఆసుపత్రిలో సగటున దాదాపు 6 ప్లాస్టిక సర్జరీ కేసులు నమోదవుతాయని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకునే వారి సంఖ్య కనీసం 25-30 శాతం పెరిగిందని, వీరిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. మెరుగైన శిక్షణ, అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ప్లాస్టిక్ సర్జరీ సులభంగా చేయగలుగుతున్నట్లు భట్టాచార్య చెప్పారు.


ప్లాస్టిక్ సర్జరీ అంటే..

క్యాన్సర్ శస్త్రచికిత్స లేదా గాయాల కారణంగా కోల్పోయిన శరీర భాగాలను బాగు చేయడం, కాలిక గాయాలతో వైకల్యాలు ఏర్పడిన సందర్భాలలో సాధారణ రూపాన్ని పునరుద్ధరించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో మరో రకం. చర్మ సౌందర్యం కోసం దీన్ని చేస్తారు.

For Latest News and National News click here

Updated Date - Jul 18 , 2024 | 08:41 AM