Share News

Local NGO : కరాచీలో వేడిగాలులకు 450 మంది మృతి

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:42 AM

పాకిస్థాన్‌ ఆర్థిక రాజధాని కరాచీలో ఎండలు, వేడిగాలులు హడలెత్తిస్తున్నాయి. వేడి గాలుల దెబ్బకి నాలుగు రోజుల్లో కనీసం 450 మంది మరణించినట్లు అక్కడి ఎన్జీవో ఈదీ ఫౌండేషన్‌ బుధవారం తెలిపింది.

Local NGO : కరాచీలో వేడిగాలులకు 450 మంది మృతి

కరాచీ, జూన్‌ 26: పాకిస్థాన్‌ ఆర్థిక రాజధాని కరాచీలో ఎండలు, వేడిగాలులు హడలెత్తిస్తున్నాయి. వేడి గాలుల దెబ్బకి నాలుగు రోజుల్లో కనీసం 450 మంది మరణించినట్లు అక్కడి ఎన్జీవో ఈదీ ఫౌండేషన్‌ బుధవారం తెలిపింది. కరాచీలో ఆదివారం నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రోడ్లపై జీవిస్తూ డ్రగ్స్‌ వినియోగించేవారే ఉన్నట్లు ఈదీ ఫౌండేషన్‌ తెలిపింది. ‘‘నగరంలో రోడ్లపై విగత జీవులుగా పడిఉన్న వారిలో చాలా మంది మాదకద్రవ్యాలు వినియోగించేవారు, నిరాశ్రయులుగా గుర్తించాం. ఆసుపత్రుల్లోని మార్చురీల్లో మృతదేహాలు పేరుకుపోయాయి. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. అయితే మృతదేహాలు తమవారివంటూ బంధువులెవరూ రాకపోవడం గమనార్హం.

Updated Date - Jun 27 , 2024 | 07:07 AM