Bhole Baba Properties: రూ.100 కోట్ల ఆస్తులు, కళ్లు చెదిరే భవంతులు.. భోలే బాబా ఆసక్తికర విషయాలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 03:03 PM
121 మంది మృతికి కారణమైన సత్సంగ్ కార్యక్రమం నిర్వహించిన భోలే బాబా(Bhole Baba) కళ్లు చదిరే ఆస్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్న ఆస్తులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే అని అధికారులు అంచనా వేస్తున్నారు.
లఖ్‌నవూ: 121 మంది మృతికి కారణమైన సత్సంగ్ కార్యక్రమం నిర్వహించిన భోలే బాబా(Bhole Baba) కళ్లు చదిరే ఆస్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్న ఆస్తులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే అని అధికారులు అంచనా వేస్తున్నారు. సత్సంగ్ తొక్కిసలాటలో 121 మంది చనిపోగా.. భోలేబాబా గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి సంబంధించి ఆస్తకిర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బోలే బాబా తరచూ తెల్లటి సూటు, బూట్లు, నల్ల కళ్లద్దాలు ధరిస్తుంటాడు. కాస్‌గంజ్, ఆగ్రా, కాన్నూర్, గ్వాలియర్ సహా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు బాబాకు ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో వీటిని నిర్వహిస్తుంటారు. బాబాకు సన్నిహితంగా ఉండే వాళ్లే వీటిని నిర్వహిస్తుంటారు. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి.
ఈయన సూరజ్‌పాల్ మెయిన్‌పురిలో 14 ఎకరాల్లో విస్తరించి ఉన్న విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివసిస్తుంటాడు. వ్యక్తిగత కమాండోలు 17 మంది ఉంటారు. టయోటో ఫార్చునర్ కారును వినియోగిస్తాడు. ఆయన కోసం వచ్చిన వారిని కలిసేందుకు వచ్చే సమయంలో భారీ కాన్వాయ్‌తో వస్తారని తెలుస్తోంది. భోలే బాబా కారుకు ముందు 16 మంది బాడీగార్డులు.. ఖరీదైన బైక్‌లపై వెళ్తూ.. ఆయన కారుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తారు.
ఇక ఆయన కారు వెనకాల దాదాపు 30 కార్లతో భారీ కాన్వాయ్ ఉంటుంది. కారు బయట లోపల మొత్తం తెల్లగా ఉంటుంది. బాబా వస్తున్నాడంటే ఓ వీఐపీకి సమానంగా భద్రత కల్పిస్తారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా తనిఖీ చేస్తారు. కళ్లు చెదిరే ఆస్తులు చూసి స్థానికులు, భక్తులు నోరెళ్లబెడుతున్నారు.
For Latest News and National News click here