18th Lok Sabha : 18వ లోక్‌సభకు 74 మంది మహిళలు
ABN , Publish Date - Jun 06 , 2024 | 05:27 AM
తాజా లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచినవారితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. అప్పుడు మొత్తం 78 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా చూస్తే... పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా 11 మంది మహిళలు ఎంపీలుగా
న్యూఢిల్లీ, జూన్ 5: తాజా లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచినవారితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. అప్పుడు మొత్తం 78 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా చూస్తే... పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా 11 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు బరిలో నిలిచారు. బీజేపీ అత్యధికంగా 69 మందికి, తర్వాత కాంగ్రెస్ 41 మందికి సీట్లు ఇచ్చాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం... ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి 30 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 14 మంది, టీఎంసీ నుంచి 11 మంది, సమాజ్‌వాదీ పార్టీ నుంచి నలుగురు, డీఎంకే నుంచి ముగ్గురు, జేడీయూ, ఎల్జేపీ(ఆర్)ల నుంచి ఇద్దరు చొప్పున మహిళలు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, ఎస్పీ నుంచి డింపుల్ యాదవ్ తమ సీట్లు నిలబెట్టుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగన, మీసా భారతి కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.